‘బాహుబలి’ కాదుగా.. అందుకే ఏ హీరో ముందుకు రారు : రక్షిత్ శెట్టి

by Shyam |
‘బాహుబలి’ కాదుగా.. అందుకే ఏ హీరో ముందుకు రారు : రక్షిత్ శెట్టి
X

దిశ, సినిమా : కన్నడ హీరో రక్షిత్ శెట్టి లేటెస్ట్ ఫిల్మ్ ‘777 చార్లి’ టీజర్ బెస్ట్ రెస్పాన్స్ అందుకుంది. డాగ్(చార్లి) కీ రోల్ ప్లే చేస్తున్న సినిమాలో మనుషులు, కుక్కలకు మధ్య ఉండే సెల్ఫ్‌లెస్ బాండ్‌ను రిప్రజెంట్ చేస్తుండగా.. ఇంట్రావర్ట్ పర్సన్‌ ధర్మగా కనిపించబోతున్నాడు రక్షిత్ శెట్టి. చార్లి కలిశాక అతని లైఫ్ ఏ విధంగా చేంజ్ అయింది.. సిగరెట్స్, బీర్, ఫ్యాక్టరీ, హోమ్‌కు మాత్రమే పరిమితమై ఒక్క ఫ్రెండ్‌ కూడా లేని ధర్మ చార్లితో ఎందుకు? ఎలా? కనెక్ట్ అయ్యాడు?. కుక్కలంటే ఇష్టముండని ధర్మ.. చార్లితో ఫ్రెండ్‌షిప్‌తో జీవితం పట్ల తన దృక్పథాన్ని ఏలా చేంజ్ చేసుకున్నాడు? అనేది కథలో చూపించారని తెలిపాడు.

కిరణ్ రాజ్ కే దర్శకత్వంలో వస్తున్న సినిమాను పాన్ ఇండియా రేంజ్‌లో రిలీజ్ చేయాలనుకుంటున్నట్లు తెలిపిన రక్షిత్ శెట్టి.. కానీ నార్త్‌లో తన గురించి పెద్దగా తెలియదన్నాడు. కానీ డాగ్ ఇప్పుడొక స్టార్ అయిపోయింది కాబట్టి హిందీలో కూడా విడుదల చేస్తున్నట్లు చెప్పాడు. సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో మూవీ రిలీజ్ ఉండొచ్చన్న హీరో.. మలయాళంలో హీరో పృథ్వీరాజ్ సుకుమారన్, తమిళ్‌లో డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు చిత్రాన్ని విడుదల చేయబోతున్నారని, తెలుగు, హిందీలో ప్రెజెంట్ చేసే వారికోసం ఎదురుచూస్తున్నామని తెలిపాడు. ఈ సినిమాను మళ్లీ రీమేక్ చేయాలనే ఉద్దేశం లేదన్న రక్షిత్.. 150 రోజుల కాల్షీట్లు ఇచ్చేందుకు ఏ హీరో ముందుకు రారని, ఎందుకంటే ఇది ‘బాహుబలి’ కాదని వివరించాడు. ముందుగా 70 రోజుల్లో షూటింగ్ పూర్తి చేయాలనుకున్నామని.. కానీ అది కాస్తా 100, 120 నుంచి 150 రోజుల వరకు వెళ్లిందని చెప్పాడు. ఈ క్రమంలోనే చార్లితో అనుబంధం పెరిగిందని తెలిపాడు.

Advertisement

Next Story