జనాభా తగ్గించిన రాష్ట్రాలకు రాజ్యసభ సీట్లెందుకు పెంచరు? మద్రాస్ హైకోర్ట్

by Shamantha N |   ( Updated:2021-08-24 05:31:19.0  )
Madras High Court
X

దిశ వెబ్‌డెస్క్ : మద్రాస్ హైకోర్టు లోక్‌సభ స్థానాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లు విజయవంతంగా తమ జనాభా నియంత్రణ చేపట్టినందుకు లోక్‌సభ ప్రాతినిధ్యాన్ని కోల్పోయాయని అభిప్రాయపడింది. కానీ కొన్ని రాష్ట్రాలు జనాభాను కట్టడి చేయకుండా అలాగే కొనసాగించటంతో పార్లమెంట్‌లో ఆయా రాష్ట్రాలు ప్రాతినిధ్యాన్ని పెంచుకున్నాయని అన్నారు. ఇలా జనాభా తగ్గించుకున్న రాష్ట్రాలకు రాజ్యసభలో ప్రాతినిధ్యం ఎందుకు కల్పించకూడదని కేంద్రాన్ని ప్రశ్నించింది. 1962 లో 42 ఎంపీ స్థానాలున్న తమిళనాడు జనాభా నియంత్రణ చర్యలు చేపట్టడంతో రెండు పార్లమెంట్ స్థానాలు కొల్పోయిందని, 1967 ఎన్నికల నాటికి కేవలం 39 స్థానాలే మిగిలాయని వెల్లడించారు.

ఆగష్టు 17 న మద్రాస్ హైకోర్ట్‌లో దాఖలైన రిట్ పిటిషన్ పై జస్టిస్ కిరుబాకరన్, జస్టిస్ పుగలేంది బెంచ్ మంగళవారం విచారించింది. ‘జనాభా నియంత్రణ చేపట్టటం వల్ల తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రెండు కలిసి నాలుగు ఎంపీ స్థానాలను కోల్పోయాయి. ఇలా పటిష్టమైన జనాభా నియంత్రణ చేప్టటిన రాష్ట్రాలకు ఎందుకు రాజ్యసభలో ప్రాతినిధ్యం కల్పించకూడదు’ అంటూ కేంద్రాన్ని ప్రశ్నించింది. ఒక్క ఎంపీ తన ఐదు సంవత్సరాల కాలపరిమితిలో తన నియోజకవర్గంలో దాదాపు 200 కోట్ల వరకు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టే అవకాశం ఉంది. ఈ లెక్కన దాదాపు 14 సార్వత్రిక ఎన్నికలల్లో దాదాపు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ 5,600 కోట్లను కోల్ఫోయాయి. ఈ మొత్తాన్ని నష్ట పరిహరం కింద రాష్ట్రాలకు కేటాయిస్తే తప్పేంటి అంటూ కేంద్రాన్ని ప్రశ్నించింది. రాజ్యాంగంలోని అధికరణ 81 ప్రకారం జనాభాతో సంబంధం లేకుండా ఎంపీ స్థానాలు మార్పు లేకుండా ఉంచవచ్చో, లేదో అని కేంద్రాన్ని ప్రశ్నించింది. అనంతరం కేసును నాలుగు వారాలకు వాయిదా వేసింది.

Advertisement

Next Story