ఆ మూడు స్థానాలకు ఉపఎన్నికలు ఎప్పుడంటే

by Shamantha N |
ఆ మూడు స్థానాలకు ఉపఎన్నికలు ఎప్పుడంటే
X

దిశ,వెబ్‌డెస్క్: గుజరాత్, అస్సోం రాష్ట్రాల్లో మూడు రాజ్యసభ స్థానాలకు ఉపఎన్నికలను మార్చి1 న నిర్వహించనున్నారు. ఈ మేరకు విషయాన్ని ఎన్నికల సంఘం ఓ ప్రకటనలో తెలిపింది. వీటిలో గతేడాది నవంబర్ 25న కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్ మరణంతో ఒక స్థానం ఖాళీ అయింది. ఆ తర్వాత గతేడాది డిసెంబర్ 1న బీజేపీ నేత అభయ్ భరద్వాజ్ మరణంతో, బోడో పీపుల్స్ ఫ్రంట్ ఎంపీ విశ్వజిత్ దైమరీ రాజీనామాతో మిగిలిన రెండు స్థానాలు ఖాళీ అయ్యాయి.

ఈ మూడు స్థానాలకు ఉపఎన్నికల నోటిఫికేషన్‌ను ఫిబ్రవరి11న విడుదల చేయనున్నారు. అనంతరం మార్చి 1న ఎన్నికలను నిర్వహించనున్నట్టు ఎన్నికల సంఘం తెలిపింది. అదే రోజు సాయంత్రం ఎన్నికల ఫలితాలను ప్రకటించనున్నట్టు పేర్కొంది. కాగా అహ్మద్ పటేల్ పదవీ కాలం అగస్ట్ 2023, భరద్వాజ్ పదవీకాలం జూన్ 2026, ఏప్రిల్ 2026లో ముగియాల్సి ఉన్న విషయం తెలిసిందే.

Advertisement

Next Story