ఎలక్షన్ కమిషనర్‌గా ప్రముఖ రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్

by Shamantha N |
ఎలక్షన్ కమిషనర్‌గా ప్రముఖ రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్
X

దిశ, వెబ్ డెస్క్: ప్రముఖ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రాజీవ్ కుమార్ కేంద్ర ఎన్నికల కమిషనర్ గా నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖ శుక్రవారం రాత్రి ఓ ప్రకటన చేసింది. రాజీవ్ కుమార్.. 1984 బ్యాచ్ జార్ఖండ్ క్యాడర్ కు చెందిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి. గతంలో ఈయన ఆర్థిక శాఖ కార్యదర్శిగా పనిచేశారు.

కాగా, ప్రస్తుతం కేంద్ర ఎన్నికల కమిషనర్ గా ఉన్న అశోక్ లవాసా ఈనెల 31న బాధ్యతల నుంచి తప్పుకోనున్నారు. ఏసియన్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ వైస్‌ ప్రెసిడెంట్ గా ఆయన నియమితులయ్యారు. ఈ నేపథ్యంలో రాజీవ్ కుమార్ ను కేంద్రం ఎన్నికల కమిషనర్ గా నియమించింది.

Advertisement

Next Story