‘లయన్ ఇన్ లంబోర్గిని’.. కారులో రజినీ షికారు

by Shyam |   ( Updated:2020-07-21 07:40:52.0  )
‘లయన్ ఇన్ లంబోర్గిని’.. కారులో రజినీ షికారు
X

సింప్లిసిటీకి కేరాఫ్ అడ్రస్ అయిన సూపర్ స్టార్ రజనీకాంత్.. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన లంబోర్గిని కారులో చక్కర్లు కొట్టారు. కరోనా కారణంగా అసలు ఇన్నిరోజులు బయట కనిపించని తలైవా.. కారులో షికారు కొట్టడంతో అభిమానులు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. తెల్ల కుర్తా, పైజామాలో ఉన్న రజినీ.. మాస్క్ వేసుకుని మరీ డ్రైవింగ్ చేసిన ఈ ఫోటోను ‘లయన్ ఇన్ లంబోర్గిని’ పేరుతో ట్విట్టర్‌లో ట్రెండ్ చేస్తున్నారు ఫ్యాన్స్. కాగా కూతురు సౌందర్య, అల్లుడు, మనవడితో కలిసి కారు ముందు దిగిన ఫొటోస్ కూడా సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉన్నాయి.

Advertisement

Next Story