- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
బతుకమ్మ సంబురాల్లో ఆడిపాడిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే
దిశ, రాజేంద్రనగర్: తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అన్నారు. సిరి స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన బతుకమ్మ సంబురాల్లో ఎమ్మెల్యే పాల్గొని, ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మహిళలతో కలిసి బతుకమ్మ పాటలకు ఆడిపాడారు. ఈ వేడుకల్లో ఎమ్మెల్యేతో పాటు మున్సిపల్ చైర్ పర్సన్ సుష్మారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… గత ప్రభుత్వాలు తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను పట్టించుకున్న పట్టించుకోలేదని అన్నారు.
రాష్ట్రం సాధించుకున్న తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహిస్తున్నారని తెలిపారు. పండుగ కానుకగా మహిళలకు చీరలు ఇచ్చి అందరికీ పెద్దన్నగా నిలిచారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ బండి గోపాల్ యాదవ్, నార్సింగి మార్కెట్ కమిటీ చైర్మెన్ వెంకటేష్ గౌడ్, ఎంపీపీ జయమ్మ శ్రీనివాస్, జెడ్పీటీసీ నీరటి తన్వీరాజ్, మండల పార్టీ అధ్యక్షుడు చంద్రారెడ్డి, గణేష్ గుప్తా, నీరటి రాజు, శ్రీకాంత్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు.