బెన్‌స్టోక్స్ స్థానంలో దక్షిణాఫ్రికా ఆటగాడు?

by Shyam |
బెన్‌స్టోక్స్ స్థానంలో దక్షిణాఫ్రికా ఆటగాడు?
X

దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్ 2021 సీజన్ రాజస్థాన్ రాయల్స్ జట్టుకు కలసి రాలేదు. సీజన్ ప్రారంభానికి ముందే జోఫ్రా ఆర్చర్ దూరం కాగా తొలి మ్యాచ్‌లో గాయపడిన బెన్ స్టోక్స్ ఇంగ్లాండ్ తిరిగి వెళ్లాడు. ఇక మరో ఆల్‌రౌండర్ లియామ్ లివింగ్‌స్టోన్ బయోబబుల్‌లో ఉండలేక ఇంటి దారి పట్టాడు. దీంతో రాయల్స్‌కు కష్టాలు తప్పడం లేదు. ఒక పేసర్, మరో స్టార్ ఆల్‌రౌండర్ లేని లోటు జట్టులో స్పష్టంగా కనిపిస్తున్నది.

దీంతో జట్టులోకి దక్షిణాఫ్రికాకు చెందిన క్రికెటర్ రస్సీ వాన్ డెర్ డస్సెన్‌ను తీసుకోవడానికి యాజమాన్యం నిర్ణయించింది. ఇప్పటికే డస్సెన్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఒక క్రీడా వెబ్‌సెట్ వెల్లడించింది. డస్సెన్ వీసా రాగానే ఇండియాకు బయలు దేరుతాడని.. ఇక్కడ బీసీసీఐ ప్రోటోకాల్ ప్రకారం క్వారంటైన్ ఉన్న అనంతరం జట్టుతో చేరే అవకాశాలు ఉన్నాయి.

Advertisement

Next Story