- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాజస్థాన్ బౌలర్ ఇంట్లో మరో విషాదం
X
దిశ, వెబ్‌డెస్క్: రాజస్థాన్ రాయల్స్ తరఫున తొలిసారి ఐపీఎల్‌లో ఎంట్రీ ఇచ్చిన చేతన్ సకారియా ఇంట్లో విషాదం నెలకొంది. ఇటీవల కరోనా బారీన పడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అతడి తండ్రి కంజీభాయ్ సకారియా మరణించాడు. ఐపీఎల్‌లో వచ్చిన డబ్బులతోనే తండ్రిని ఆస్పత్రిలో చేర్పించి.. చికిత్స అందిస్తున్న సకారియా.. తండ్రి మరణంతో కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నాడు. తమ్ముడి ఆత్మహత్యను మరువక ముందే.. చేతన్ తండ్రిని కూడా కోల్పోవడం బాధాకరం. ఇదే ఏడాది జనవరిలో సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ఆడుతున్న సమయంలో అతడి తమ్ముడు రాహుల్ సకారియా మానసిక కుంగుబాటుతో ఆత్మహత్య చేసుకున్నాడు. పేదరికం నుంచి ఇప్పుడిప్పుడే ఆర్థికంగా మెరుగుపడుతున్న చేతన్ సకారియాకు ఇలా జరగడం దారుణమని నెటిజన్లు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Advertisement
Next Story