రాజస్థాన్ ఘన విజయం.. స్టోక్స్ విధ్వంసం

by Anukaran |
రాజస్థాన్ ఘన విజయం.. స్టోక్స్ విధ్వంసం
X

దిశ, వెబ్‌డెస్క్: అబుదాబి వేదికగా ఆదివారం రాత్రి రాజస్థాన్ రాయల్స్‌, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్ నిర్ధేశించిన 196 పరుగుల భారీ లక్ష్యాన్ని కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 18.2 ఓవర్లలో 196 పరుగులు చేసి అలవోకగా చేధించింది. ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ బ్యాట్స్‌మెన్ బెన్‌ స్టోక్స్ అదరగొట్టాడు. సెంచరీతో ముంబై ఇండియన్స్‌పై విరుచుకుపడ్డాడు. అంతేగాకుండా స్టోక్స్‌కు తోడు సంజూ శామ్సన్ చక్కటి సహకారం అందించి, హాఫ్ సెంచురీతో అద్భుతంగా రాణించాడు.

కాగా ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్.. 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 195 స్కోర్ చేసింది. హార్దిక్ పాండ్యా సిక్స్‌ల వర్షం కురిపించాడు. 21 బంతుల్లోనే 60 పరుగులు చేశాడు. ఇందులో 2 ఫోర్లు, 7 సిక్స్‌లు ఉన్నాయి. హార్దిక్‌కు తోడు, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, సౌరభ్ తివారి లాంటి బ్యాట్‌మెన్స్ చెలరేగి ఆడి, భారీ స్కోరు నిర్ధేశించినా రాజస్థాన్ స్పీడ్‌కు అడ్డుకట్ట వేయలేకపోయారు.

Advertisement

Next Story