- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
హైదరాబాద్‌లో రాజస్థాన్ ప్రభుత్వ పెట్టుబడిదారుల సమావేశం
దిశ, మియాపూర్: రాష్ట్రం ప్రభుత్వ అభివృద్ధి చెందుతున్న పారిశ్రామిక విధానంతోపాటుగా ఔత్సాహిక పెట్టుబడి దారులకు అనుకూలమైన వాతావణాన్ని తెలియజెప్పే లక్ష్యంతో రాజస్థాన్ ప్రభుత్వం మాదాపూర్ లోని వెస్టిన్ హోటల్ లో ఇన్వెస్టర్ కనెక్ట్ పేరుతో కార్యక్రమం నిర్వహించింది. రాజస్థాన్ పరిశ్రమలు, వాణిజ్య శాఖా మంత్రి శకుంతల రావత్, సాంకేతిక విద్య, ఆయుర్వేద, భారతీయ ఔషధాల మంత్రి సుభాష్ గార్గ్, రెవెన్యూశాఖ మంత్రి రామ్ లాల్ జాట్ ఈ కార్యక్రమంలో ముఖ్య అథిధులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రుల నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం ఇన్వెస్ట్ మెంట్ రోడ్ షోలో భాగంగా ఔత్సాహిక పెట్టుబడి దారులతో చర్చలు జరిపింది. ఈ రోడ్ షో జైపూర్ లో జనవరి 24 ,25 న జరగనున్న ” ఇన్వెస్ట్ రాజస్థాన్.. ఇన్వెస్ట్ మెంట్ సమ్మిట్ 2022” దిగ్విజయం చేసే లక్ష్యంతో జాతీయ బాగస్వామి అయిన సీఐఐ మద్దతుతో ఏర్పాటు చేశారు. హైదరాబాద్ కేంద్రంగా కార్యలాపాలు నిర్వహిస్తున్న వ్యాపారవేత్తలను ఉదేశించి బీ2జీ సమావేశాలు నిర్వహించడంతోపాటు, రాష్ట్ర అభివృద్ధికి భాగస్వామ్యం కావాలని పారిశ్రామిక వేత్తలను ఈ సందర్భంగా ఆహ్వనించింది.
రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖా మంత్రి శకుంతల రావత్ మాట్లాడుతూ… ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ నాయకత్వంలోని రాజస్థాన్ ప్రభుత్వం పరిశ్రమలకు సంబంధించి అన్ని రంగాల్లోనూ వృద్ధిని సాధ్యం చేసేందుకు తగిన విధాన కార్యాచరణ రూపొందించిందన్నారు. రాష్ట్ర పారిశ్రామిక వాతావరణన్ని సమూలంగా మార్చడంలో ఇన్వెస్ట్ రాజస్థాన్ 2022 ఓ మైలరాయిగా నిలవనుందన్నారు. రెవెన్యూ మంత్రి రాంలాల్ జాట్ మాట్లాడుతూ.. అతి సులభ వ్యాపారాలను నిర్వహించుకో తగిన వాతావరణం కల్గిన రాష్ట్రాలలో రాజస్థాన్ ముందుందన్నారు. కార్యక్రమంలో అడిషనల్ చీఫ్ సెక్రటరీ, మైన్స్ ఆండ్ పెట్రోలియం డా. సుబొద్ అగర్వాల్, కమిషనర్, పరిశ్రమలు, వాణిజ్యం అర్చనా సింగ్, రాష్ట్ర ప్రభుత్వ ఉన్నాధికారుల బృందం, సీఐఐ పూర్వ చైర్మన్ సంజయ్ సింగ్, అనిల్ సాబు తదితరులు పాల్గొన్నారు.