చైనా మాంజాలను విక్రయిస్తే కఠిన చర్యలు : ఎస్పీ

by Kalyani |
చైనా మాంజాలను విక్రయిస్తే కఠిన చర్యలు : ఎస్పీ
X

దిశ, సంగారెడ్డి అర్బన్ : ప్రజలకు ప్రమాదకరంగా మారిన చైనా, ప్లాస్టిక్ మాంజాలను విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్ హెచ్చరించారు. మంగళవారం నిషేధిత మాంజాలను విక్రయిస్తున్న వారిపై ఇప్పటికే 5 కేసులు నమోదు చేసినట్లు ఆయన వివరించారు. ఇందుకు సంబంధించిన వివరాలను జిల్లా ఎస్పీ ఒక ప్రకటనలో తెలిపారు.

కఠిన చర్యలు తప్పవు - ఎస్పీ

సంక్రాంతి పండుగను పురస్కరించుకొని, చిన్న, పెద్ద తేడా లేకుండా అందరూ ఆనందోత్సాహాలతో గాలిపటాలను ఎగరవేస్తూ సంబరంగా సంక్రాంతి పండగను జరుపుకుంటారు. కానీ పర్యావరణానికి, హానికరమైన నిషేధిత ప్లాస్టిక్, చైనా మాంజాల వాడకం వలన ప్రతి ఏటా అనేక మూగ జీవులు, వాహనదారులు ప్రాణాలు కోల్పోతున్నారు. కావున మాంజాల వినియోగానికి దూరంగా ఉండాలని సూచించారు.

మనం ఎగురవేసే గాలిపటాల మాంజాలు కరెంటు తీగలకు చుట్టుకొని షాక్ సర్క్యూట్ అవ్వడం, అమాయక పక్షులకు చుట్టుకొని వాటి ప్రాణాలు కోల్పోవడం జరుగుతుందన్నారు. ప్లాస్టిక్/చైనా మాంజాల వలన ద్విచక్ర వాహనదారులు ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు అనేకం గతంలో ఉన్నాయని గుర్తు చేశారు. కావున ప్రజలు దీనిని చిన్న విషయంగా భావించి నిర్లక్ష్యం వహించకుండా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. మనం ఆనందంతో జరుపుకునే పండగ పర్యావరణానికి హానికరం కాకూడదు అన్నారు.

జిల్లా వ్యాప్తంగా నిషేధిత ప్లాస్టిక్/చైనా మాంజాల అమ్మకాలపై జిల్లా పోలీసు శాఖ విస్తృత స్థాయిలో దాడులు నిర్వహిస్తూ 70 ప్యాకెట్ల ప్లాస్టిక్/చైనా మాంజాల సీజ్ చేసి, దుకాణదారులపై 5 కేసులు నమోదు చేయడం జరిగిందన్నారు. జిల్లా ప్రజలెవ్వరూ నిషేధిత మాంజాలను వినియోగించరాదని సూచించారు. నిబంధనలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మరోసారి హెచ్చరించారు.

Advertisement

Next Story