బెల్ట్ షాప్‌లో గంజాయి అమ్మకం..

by Aamani |
బెల్ట్ షాప్‌లో గంజాయి అమ్మకం..
X

దిశ,మణుగూరు : మణుగూరు మండలం సమితి సింగారం గ్రామ పంచాయతీలోని ఓ బెల్ట్ షాపులో గంజాయి అమ్ముతున్నారు. ఈ పక్కా సమాచారంతో సబ్ డివిజన్ డీఎస్పీ ఆదేశాలతో,సీఐ సతీష్ సమక్షంలో ఎస్సై మేడా ప్రసాద్ తన సిబ్బందితో కలిసి ఓ బెల్ట్ షాప్ లో తనిఖీలు నిర్వహించారు.ఈ తనిఖీల్లో భాగంగా ఇదే గ్రామానికి చెందిన స్వరూప అనే ఒక మహిళ దగ్గర సుమారు రెండు కేజీల గంజాయి దొరికిందని ఎస్సై ప్రసాద్ తెలిపారు.ఓ నలుగురు వ్యక్తులు అక్రమంగా ఓ ఆటోలో ఒరిస్సా రాష్ట్రంలోని చిత్రకొండ ప్రాంతానికి చెందిన మరో వ్యక్తికి తరలిస్తున్నారని తెలిపారు.

అలాగే అదే రాష్ట్రం నుంచి ఓ వ్యక్తి గంజాయిని తక్కువకు కొనుగోలు చేసి స్వరూపకు ఇస్తున్నారన్నారు. స్వరూప తన బెల్ట్ షాప్ వద్దకు వచ్చే వ్యక్తులకు అదే విధంగా కాలేజీ దగ్గర గాని ఇతర ప్రాంతంలో వ్యక్తులకు చిన్న చిన్న ప్యాకెట్లుగా చుట్టి గంజాయి అమ్ముతారని తెలిపారు.వెంటనేముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు చేసి అరెస్టు చేసి రిమాండ్ కు పంపించడం జరిగిందన్నారు.ఈ తనిఖీలో సిబ్బంది ఆగు షమీం,రవీందర్, కన్నారావు,పీసీ పద్మ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story