Mining licence: మైనింగ్ ప్రాజెక్టును రద్దు చేయాలి.. మదురైలో భారీ ర్యాలీ

by vinod kumar |
Mining licence: మైనింగ్ ప్రాజెక్టును రద్దు చేయాలి.. మదురైలో భారీ ర్యాలీ
X

దిశ, నేషనల్ బ్యూరో: తమిళనాడు (Thamilnadu)లోని మదురై (Madurai) జిల్లాలో టంగ్‌స్టన్ మైనింగ్ ప్రాజెక్టు (Tungstan mining Project)ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం భారీ ర్యాలీ నిర్వహించారు. నరసింగంపట్టి గ్రామం నుంచి తాళ్లకుళం వరకు నిరసనకారులు ఆందోళన చేపట్టారు. ఈ ర్యాలీకి వేలాదిగా హాజరయ్యారు. కేంద్ర ప్రభుత్వవానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. టంగ్‌స్టన్ మైనింగ్ కోసం ది హిందుస్థాన్ జింక్ లిమిటెడ్‌కు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పర్మిషన్ వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. నిరసనల నేపథ్యంలో ఆ ప్రాంతంలో భారీగా పోలీసులను మోహరించారు. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లించారు.

కాగా, గతేడాది నవంబర్ 7న మదురై జిల్లాలోని మేలూర్ తాలూకాలోని పది గ్రామాల్లో 5,000 ఎకరాల్లో టంగ్‌స్టన్ మైనింగ్ నిర్వహించడానికి వేదాంత లిమిటెడ్ అనుబంధ సంస్థ అయిన ది హిందుస్థాన్ జింక్ లిమిటెడ్‌కు కేంద్రం లైసెన్స్ మంజూరు చేసింది. దీంతొ అప్పటి నుంచి ఆ ప్రాంతంలో స్థానికులు నిరసనలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే సీఎం ఎంకే స్టాలిన్ ప్రధాని మోడీకి లేఖ రాశారు. మైనింగ్ లైసెన్స్‌ను రద్దు చేయాలని కోరారు. టంగ్‌స్టన్ మైనింగ్‌కు వ్యతిరేకంగా తమిళనాడు అసెంబ్లీలో తీర్మానాన్ని ఆమోదించారు.

Advertisement

Next Story