ఆ నగరాల్లో సాయంత్రం 6గంటల నుంచి నైట్‌ కర్ఫ్యూ..

by Shamantha N |
ఆ నగరాల్లో సాయంత్రం 6గంటల నుంచి నైట్‌ కర్ఫ్యూ..
X

దిశ, వెబ్ డెస్క్ : రాజస్థాన్‌లో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. సెకండ్ వేవ్ కారణంగా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మరో కీలక ప్రకటన చేసింది. నైట్‌ కర్ఫ్యూను మరో రెండు గంటలు పొడిగిస్తున్నట్టు ప్రభుత్వం ఓ ప్రకటనలో పేర్కొంది. నైట్‌ కర్ఫ్యూను సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు మొత్తం 12 గంటలు విధిస్తున్నట్టు తెలిపింది. ఈ నెల 16 నుంచి 30వ తేదీ వరకు నైట్‌ కర్ఫ్యూ అమలు చేయనున్నారు. ఈ మేరకు సీఎం అశోక్‌ గెహ్లాట్‌ నైట్‌ కర్ఫ్యూ పొడిగింపుపై నిన్న రాత్రి నిర్ణయం తీసుకున్నారు.

అయితే, నైట్‌ కర్ఫ్యూ కారణంగా ప్రభుత్వ కార్యాలయాలను సాయంత్రం 4 గంటలకు, అన్ని షాపులను సాయంత్రం 5 తర్వాత మూసివేయనున్నారు. అజ్మీర్, అల్వార్, భిల్వారా, చిత్తోర్‌గఢ్‌, దుంగార్‌పూర్, జైపూర్, జోధ్‌పూర్‌, కోటా, అబూ రోడ్ నగరాల్లో ఈ నెల 16 నుంచి రాత్రి కర్ఫ్యూను 12 గంటలకు పొడిగించారు.

Advertisement

Next Story