స‌చిన్ అండ్ గ్యాంగ్‌కు మ‌ళ్లీ ఊర‌ట‌.. 24 వ‌ర‌కు సేఫ్‌..!

by Shamantha N |   ( Updated:2020-07-21 06:45:35.0  )
స‌చిన్ అండ్ గ్యాంగ్‌కు మ‌ళ్లీ ఊర‌ట‌.. 24 వ‌ర‌కు సేఫ్‌..!
X

దిశ, వెబ్‌డెస్క్ :
రాజస్థాన్ రాజకీయ సంక్షోభంలో ఉత్కంఠ కొన‌సాగుతూనే ఉంది. మ‌రోసారి హైకోర్టులో రెబ‌ల్ నేత సచిన్ పైలట్, ఆయ‌న వ‌ర్గానికి ఊరట లభించింది. రాజ‌స్థాన్ అసెంబ్లీ స్పీక‌ర్ జోషి ఇచ్చిన నోటీసుల‌ను స‌వాలు చేస్తూ స‌చిన్ పైల‌ట్‌తో పాటు మ‌రో 18 మంది రెబ‌ల్‌ ఎమ్మెల్యేలు.. హైకోర్టును ఆశ్ర‌యించారు. పిటిష‌న్‌పై విచార‌ణ చేప‌ట్టిన కోర్టు.. మొద‌ట ఇవాళ్టి వ‌ర‌కు ఎమ్మెల్యేల‌పై ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోకూడ‌ద‌ని ఆదేశించింది. ఇక‌ నేటి విచార‌ణ సంద‌ర్భంగా సచిన్ పైలట్, అతని గ్రూప్ ఎమ్మెల్యేలకు మ‌రోసారి హైకోర్టులో ఉప‌శ‌మ‌నం ల‌భించింది.. సచిన్ పైలట్, 18 మంది ఎమ్మెల్యేల అనర్హత వేటు అంశంపై జులై 24వ తేదీ వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని అసెంబ్లీ స్పీకర్‌కు హైకోర్టు సూచించింది. కాగా, సీఎం అశోక్ గెహ్లాట్‌పై తిరుబాటు చేసిన స‌చిన్ పైలట్‌పై కాంగ్రెస్ పార్టీ వేటు వేసిన సంగ‌తి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయ‌న డిప్యూటీ సీఎం పోస్టుతో పాటు.. రాజ‌స్థాన్ కాంగ్రెస్ పీసీసీ చీఫ్ ప‌ద‌వి కూడా పోగొట్టుకున్నారు. బీజేపీతో క‌లిసి స‌చిన్ పైల‌ట్ కుట్ర‌లు చేస్తున్నార‌ని సీఎం అశోక్ గెహ్లాట్ ఆరోపిస్తున్నారు.

Advertisement

Next Story