మహేష్ స్క్రిప్ట్ పనుల్లో జక్కన్న

by Shyam |
మహేష్ స్క్రిప్ట్ పనుల్లో జక్కన్న
X

దర్శక ధీరుడు రాజమౌళి… “రౌద్రం రణం రుధిరం” సినిమాను తెరకెక్కిస్తున్నారు. దాదాపు 70 శాతం పూర్తైన ఈ చిత్రం రూ. 300 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతుండగా… ఎన్టీఆర్, రామ్ చరణ్ తేజ్ కొమురం భీమ్, అల్లూరి సీతారామరాజు పాత్రలు చేస్తున్నారు. లాక్ డౌన్ పూర్తి కాగానే మిగిలిన సన్నివేశాలు చిత్రీకరించేందుకు అన్ని సిధ్ధం చేసుకునే ఉన్నాడట జక్కన్న. దీంతో నెక్స్ట్ ప్రాజెక్ట్ పై కాన్సంట్రేట్ చేశాడు. ఈ మధ్యే తన తర్వాతి చిత్రం సూపర్ స్టార్ మహేష్ తో ఉంటుందని ప్రకటించారు.

కాగా ఈ సినిమా కథ గురించే తండ్రి విజయేంద్ర ప్రసాద్ తో చర్చిస్తున్నారట రాజమౌళి. మహేష్ ఇంతకు ముందు చేయని పాత్రలో ప్రేక్షకులకు చూపించాలని జక్కన్న ఆరాటపడుతున్నారు. అందుకే విజయేంద్ర ప్రసాద్ దగ్గర ఉన్న అన్ని స్టోరీ లైన్స్ ఉంటున్నారట. వీటిలో ఒక్కటి ఫైనల్ చేస్తే.. ఆ కథ డెవలప్ చేస్తారట విజయేంద్ర ప్రసాద్. మొత్తానికి జక్కన్న డైరెక్షన్ లో సినిమా అంటే… సమ్ థింగ్ స్పెషల్ ఉంటుంది. అందుకే మహేష్ ఫ్యాన్స్ సంబరపడుతున్నారు. నిజానికి RRR కు ముందే మహేష్ తో జక్కన్న సినిమా ఉంటుందని ఆశించారు ఫ్యాన్స్. కనీసం ఇప్పటికైనా ఆ కల నెరవేరుతుండడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Tags: SSRajamouli, Mahesh Babu, NTR, Ram Charan Tej, Vijayendra Prasad, RRR

Advertisement

Next Story