- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్లాస్మా చికిత్సపై స్పందించిన జక్కన్న
దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌలి ప్రస్తుతం రామ్ చరణ్, ఎన్టీఆర్‌ల కాంబీనేషన్‌లో వస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నారు. కరోనా విస్తృత వ్యాప్తి కట్టడికి విధించిన లాక్‌డౌన్ కాలంలో ఆయన తదుపరి చిత్రం కోసం స్ర్కిప్టును రెడీ చేసుకుంటున్న ఇటీవల సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి. లాక్‌డౌన్ కాలంలో ఉపాధి కరువైన సినీ కార్మికులను ఆదుకోవడం కోసం తనవంతు ఆర్థికసాయం కూడా ప్రకటించారు జక్కన్న. అంతేగాకుండా సోషల్ మీడియాలో కూడా ఆయన చురుగ్గా పాల్గొంటారు. కాగా కరోనా వైరస్ బారినపడిన వాళ్లకు ప్లాస్మా చికిత్స చేస్తే త్వరగా కోలుకుంటారన్న వార్తలపై రాజమౌళి స్పందించారు. మీరు కరోనా నుంచి కోలుకున్నారా… అయితే అవసరంలో ఉన్న ఇతరులకు సాయం చేసేందుకు ముందుకు రండి, ప్లాస్మా దానం చేయండి అంటూ పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా ఆయన కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు కూడా చేశారు. కరోనా బారినపడడం తప్పేమీ కాదని, ఇదొక సామాజిక కళంకం అని భావించి వెనుకడుగు వేయకుండా ఇతరుల ప్రాణాలను కాపాడేందుకు తమవంతు సాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్లాస్మా దాతగా మీ పేర్లను ఇక్కడ నమోదు చేసుకోవాలంటూ గివ్ రెడ్ డాట్ ఇన్ (givered.in) అనే స్వచ్ఛంద సంస్థ వెబ్ సైట్‌ను కూడా తన ట్వీట్‌లో పొందుపరిచారు.