- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ సారు పదవికి ఎసరు?
దిశ, న్యూస్‌బ్యూరో: కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఎమ్మెల్యే పదవికి ఎసరొచ్చినట్లేనా? ఆయనకు చెక్ పెట్టడానికి అధికార పార్టీ రచించిన ప్రణాళిక మున్ముందు తీవ్రం కానుందా? ముఖ్యమంత్రి ఆవేశానికి తగినట్లుగానే స్పీకర్ కూడా ఆయనపై చర్య తీసుకోనున్నారా? నిజంగానే స్పీకర్ ఆ తరహా చర్య తీసుకునే అవకాశం ఉందా? కళ్ల ముందు జరుగుతున్న తాజా పరిణామాలు ఎక్కడిదాకా వెళ్తాయి? అసెంబ్లీలో పలువురు ఎమ్మెల్యేల మధ్య జరుగుతున్న చిట్‌చాట్. ఇప్పుడు ఇది హాట్ టాపిక్‌గా మారింది. అసెంబ్లీ సమావేశాల్లో రాజగోపాల్‌రెడ్డి క్రమశిక్షణారాహిత్యం ప్రదర్శించారని టీఆర్ఎస్‌కు చెందిన పలువురు ఎమ్మెల్యేలు స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. ఆయన్ను సస్పెండ్ చేయాలని ఒత్తిడి తెస్తున్నట్టు సమాచారం. రాజగోపాల్‌రెడ్డిని ఒకవేళ ఎమ్మెల్యే పదవి నుంచి డిస్‌క్వాలిఫై చేస్తే ఎలాంటి వ్యూహాన్ని అనుసరించాలి? న్యాయపోరాటానికి సిద్ధమవ్వాల్సిందేనని కాంగ్రెస్ పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.
బై ఎలక్షన్ వస్తుందా?
శనివారం (ఈ నెల 7న) మీడియాతో జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ మాటలను చూస్తుంటే అవాస్తవాలు మాట్లాడిన కోమటిరెడ్డి సభ్యత్వంపై వేటువేసే అవకాశం ఉందనీ, బైఎలక్షన్ వస్తుందేమోనని అభిప్రాయపడ్డారు. ఆయన మాటలను బట్టి ఇక బైఎలక్షన్ కన్‌ఫార్మ్ అయినట్టేననే చర్చ కూడా జిల్లా రాజకీయ వర్గాల్లో సాగుతోంది. అయితే, అలా జరిగితే మరో మారు టీఆర్ఎస్‌ను రాజగోపాల్‌రెడ్డి ఓడించే అవకాశం ఉంటుందా! చూడాలి. ఈ నెల 6 నుంచి ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాల్లో రెండోరోజు గవర్నర్ ప్రసంగంపై జరిగిన చర్చలో రాజగోపాల్‌రెడ్డి హౌస్‌లో ఇతర సభ్యుల పట్ల అగౌరవంగా వ్యవహరించారని అధికార పార్టీలో ఎమ్మెల్యేలు స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. మంత్రులకు గౌరవం ఇవ్వకుండా ఏకవచనంతో సంబోధించారనీ, అలాంటి వ్యక్తి అసెంబ్లీ ఉండటం శాసనసభ ప్రతిష్టకు అగౌరవమని అధికార పార్టీ సభ్యుల ఆరోపిస్తున్నారు. ఈ కారణాల చేత రాజగోపాల్‌రెడ్డి శాసనసభ సభత్వాన్ని రద్దు చేయడమే శ్రేయస్కరమని అధికార టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పీకర్‌కు తెలిపారు.
ప్రశ్నిస్తే రద్దు చేస్తారా?
అసెంబ్లీలో ప్రభుత్వ పనితీరును ప్రశ్నిస్తేనే శాసనసభ సభ్యుని సభ్యత్వాన్ని రద్దు చేస్తారా? గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా శాసనసభ్యునిగా అతని అభిప్రాయాలు చెప్పడమే నేరమా? అని కాంగ్రెస్ పార్టీ వర్గాలు అధికార పార్టీని ప్రశ్నిస్తున్నాయి. అధికార బలంతో రాజగోపాల్‌రెడ్డి సభ్యత్వాన్ని రద్దు చేస్తే భవిష్యత్ కార్యాచరణ ఏమిటనే చర్చ రాజగోపాల్‌రెడ్డి అనుచరుల్లో జోరుగా నడుస్తోంది. ఒక వేళ ఉప ఎన్నికలే నిర్వహించాల్సి వస్తే పార్టీ మళ్లీ రాజగోపాల్‌రెడ్డిని బరిలో నిలుపుతుందా? అని అనుకుంటున్నారు.
అయితే, గతంలో కేటీఆర్‌పై రాజగోపాల్‌రెడ్డి ప్రశంసల వర్షం కురిపించారు. సీఎం కేసీఆర్‌పై ఎన్నడూ వ్యక్తిగతంగా విమర్శలు చేయలేదు. దీంతో ఆయన టీఆర్ఎస్‌లో చేరుతారన్న ఊహాగానాలు వచ్చాయి. ఆయన పార్టీలోకి రావడం అదే జిల్లాపై పట్టు సాధించుకోవాలనుకుంటున్న మంత్రికి ఇష్టం లేదనే వ్యాఖ్యలూ వినిపించాయి. కానీ, ఇవేవీ జరగలేదు. తాజా పరిణామాలతో రాజగోపాల్‌రెడ్డి సభ్యత్వం రద్దు చేయడం ద్వారా బైఎలక్షన్ వస్తే అప్పుడు అధికార పార్టీ హవా చూపించొచ్చనీ, తద్వారా జిల్లా రాజకీయం టీఆర్ఎస్ చేతుల్లోకి వస్తుందని ఆ పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.
Tags: telangana, assembly, congress, MLA, rajagopal reddy, trs,