- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఫ్లాష్.. ఫ్లాష్.. రాజ్‌న్యూస్ రిపోర్టర్ కిడ్నాప్
దిశ, వెబ్‌డెస్క్: ‘జర్నలిస్ట్ రఘు కిడ్నాప్’ ఉదంతం తెలంగాణలో సంచలనం రేపుతోంది. రాజ్‌న్యూస్ రిపోర్టర్ రఘు గురువారం ఉదయం 9 గంటల ప్రాంతంలో కిడ్నాప్‌కు గురయ్యాడు. మల్కాజిగిరిలోని ఆయన నివాసానికి సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు నెంబర్ ప్లేట్ లేని జీపులో వచ్చి.. తలకు ముసుగు కప్పి, చేతులు కట్టి బలవంతంగా రఘును తీసుకెళ్లారు.పోలీసులే రఘును ఎత్తుకెళ్లినట్టు పలువురు మీడియా వేదికగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గతంలో గుర్రంపోడు గిరిజన భూముల్లో అధికార పార్టీ నేతల ఆక్రమణ చేస్తున్నారని రఘు న్యూస్ కవరేజ్ చేశాడు. ఈ నేపథ్యంలోనే బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్‌తో పాటు రఘుపైన కూడా ఐపీసీ IPC 143, 144, 147, 148, 149, 332, 333 r/w, సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇటువంటి పరిస్థితుల్లో జర్నలిస్టు రఘు కిడ్నాప్ ఉత్కంఠ రేపుతోంది.
ఇదే విషయంపై స్పందించిన యూనియన్ ఆఫ్ తెలంగాణ జర్నలిస్ట్స్ రాష్ట్ర కమిటి.. మీడియాపై కేసీఆర్ కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని కోరింది. ప్రజా సమస్యలను వెలుగులోకి తెస్తున్న జర్నలిస్ట్ రఘుపై నిర్భందం మోపడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు ప్రకటించింది.