రాజ్‌కుంద్రా పోర్న్ కేసు.. మరో నటికి ముంబై క్రైం బ్రాంచ్ సమన్లు

by Jakkula Samataha |
gehana -raj kundra
X

దిశ, సినిమా : రాజ్ కుంద్రా పోర్నోగ్రఫీ కేసు రోజుకో మలుపు తిరుగుతుంది. జూహులోని తన ఇంట్లో పోలీసులు రైడ్ చేయగా.. ఆ సమయంలో రాజ్‌ను కూడా ఇంటికి తీసుకొచ్చారు. ఈ టైమ్‌లో శిల్పా శెట్టికి తనకు మధ్య వాగ్వాదం జరిగిందని, స్టేట్‌మెంట్ రికార్డింగ్‌ చేస్తున్నప్పుడు ఏడ్చేసిందని వార్తలు వచ్చాయి. కాగా ఈ కేసులో ఫస్ట్ నుంచి రాజ్‌ను సపోర్ట్ చేస్తూ ఇతరుల కామెంట్స్‌కు సమాధానం చెప్తున్న గెహనా వశిష్టకు తాజాగా ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు సమన్లు జారీ చేశారు.

తనతో పాటు మరో ఇద్దరిని విచారణకు హాజరుకావాలని సూచించారు. కాగా, గెహనా పోర్నోగ్రఫీ కేసులో ఫిబ్రవరి 4న అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత నాలుగు నెలలకు రిలీజ్ అయిన ఆమెను రాజ్ కుంద్రా కేసులో మళ్లీ విచారించనున్నారు. అయితే, ఆదివారం మధ్యాహ్నం 12 గంటలలోపు విచారణకు హాజరుకావాల్సి ఉన్నా తాను ముంబైలో లేకపోవడంతో పాజిబుల్ కాలేదని తెలిపింది గెహనా. కానీ పోర్నోగ్రఫీ ఫిల్మ్ రాకెట్ కేసులో ఇన్వెస్టిగేషన్‌కు పూర్తిగా సహకరిస్తానని వెల్లడించింది.

Advertisement

Next Story