శిల్పాశెట్టిపై పోర్నోగ్రఫీ మచ్చ.. రాజ్ కుంద్రా ఎఫెక్ట్ ఆమె కెరీర్‌పై పడినట్టేనా..?

by Shyam |   ( Updated:2021-07-26 05:43:05.0  )
శిల్పాశెట్టిపై పోర్నోగ్రఫీ మచ్చ.. రాజ్ కుంద్రా ఎఫెక్ట్ ఆమె కెరీర్‌పై పడినట్టేనా..?
X

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా పోర్నోగ్రఫీ కేసులో అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఇటీవలే ఆ కేసు విచారణలో భాగంగా శిల్పాశెట్టిని, ఆమె చెల్లెలు షమితా శెట్టిని పోలీసులు విచారించారు. ఈ నేపథ్యంలోనే తన భర్త అమాయకుడని, శృంగార సినిమాలు తీస్తాడే కానీ పోర్న్ వీడియోలు తీయడని శిల్పా భర్తను వెనకేసుకొస్తూ మాట్లాడిందని సమాచారం. అంతేకాకుండా ఒక పక్క భర్తను సమర్థిస్తూనే.. మరో వైపు తన వలన పరువు పోయినట్లు తెలుపుతూ ఏడ్చిందని బాలీవుడ్ వర్గాలు తెలుపుతున్నాయి. దాదాపు ఆరు గంటల పాటు పోలీసుల ప్రశ్నాస్త్రాల్ని ఎదుర్కున్న శిల్పాశెట్టి.. భర్త తప్పుడు పనుల గురించి తనకు తెలియదని.. తన భర్త అలాంటి పనులు చేయడని తెలిపిందట. ఇక ఇదే సమయంలో ఆమె కొన్ని ఎదురు ప్రశ్నలను పోలీసులను సంధిస్తూ.. నిజంగా రాజ్ కుంద్రానే ఈ పనులు చేశాడా..? అనే విధంగా అడిగినట్లు తెలుస్తోంది.

భర్త చేసిన ఈ పనితో తన ఇమేజ్ మొత్తం డ్యామేజ్ అయ్యిందని కన్నీరు పెట్టుకున్న శిల్పాశెట్టి ఈ ఘటన వలన తాను కొత్త ప్రాజెక్ట్ ల నుంచి తప్పుకోవాల్సి వచ్చిందని తెలిపిందట. ఇక విచారణ నిమిత్తం ఇంటికి వచ్చిన రాజ్‌కుంద్రాతో శిల్పా వాగ్వాదానికి దిగినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇకపోతే ఈరోజు రాజ్ కుంద్రా కాన్పూర్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉన్న రెండు బ్యాంక్ అకౌంట్లను క్రైమ్ బ్రాంచ్ పోలీసులు సీజ్ చేశారు. అంతేకాకుండా రాజ్ కుంద్రా పోర్న్ వీడియో కేసులో ఆయన వద్ద పనిచేసిన ఉద్యోగులే వ్యతిరేక సాక్ష్యం ఇచ్చేందుకు సిద్దమవడం సంచలనంగా మారింది.

Advertisement

Next Story