బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శిల్పాశెట్టి మిస్సింగ్..?

by Anukaran |   ( Updated:2021-07-22 04:50:00.0  )
raj kundra news
X

దిశ, వెబ్‌డెస్క్: పోర్నోగ్రఫీ కేసులో వ్యాపారవేత్త, సీనియర్‌ కథానాయిక శిల్పాశెట్టి భర్త రాజ్‌కుంద్రాను ముంబయి క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. రాజ్ కుంద్రా నేరం చేసినట్టు తమ వద్ద తగిన ఆధారాలున్నాయన్న ముంబై పోలీసులు ఆయనను జూలై 23 వరకు పోలీసు కస్టడీకి పంపారు. ఇక ఈ వార్త బాలీవుడ్ లో సంచలనం సృష్టిస్తోంది. ఇక ఇప్పటివరకు భర్త కేసుపై శిల్పాశెట్టి నోరు తెరవకపోవడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఎప్పుడు మీడియాలో యాక్టివ్ గా ఉండే శిల్పా భర్త అరెస్ట్ తర్వాత కనుమరుగయ్యారు. ఆమె ఆచూకీ ఎవరికి తెలియనంత రహస్య ప్రాంతానికి వెళ్లిపోయారని, ఫోన్లు కూడా స్విచ్ఛాఫ్ చేసినట్టుగా తెలుస్తోంది. ఈ వార్తకు ఆజ్యం పోస్తూ ఆమె షూటింగ్ కి కూడా హాజరుకాలేదని సమాచారం.

ప్రస్తుతం శిల్పాశెట్టి ‘సూపర్ డ్యాన్సర్ 4’ అనే రియాలిటీ షోలో జడ్జీగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. మంగళవారం ఈ షో షెడ్యూల్ ఉండగా.. ఆమె గైర్హాజరు అయ్యినట్లు తెలుస్తోంది. ఇక ఆమె ప్రస్తుతం సోదరి షమిత, తల్లితో కలిసి జుహులోని ఒక బంగ్లాలో ఉందని అంటున్నారు. కాగా, సంచలనంగా మారిన ఈ విషయమై శిల్పా ఏమి మాట్లాడడం లేదు ఎందుకని, భర్తను పొగడమంటే మీడియా ముందు గంటలతరబడి మాట్లాడిన ఆమె.. ఇప్పుడేం చేస్తోంది..? ఎక్కడికి వెళ్ళిపోయింది..? అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. అంతేకాకుండా శిల్పాశెట్టి ఎక్కడ..? అంటూ ట్రెండ్ చేస్తున్నారు. మరి ఈ విషయమై శిల్పాశెట్టి ఎలా స్పందిస్తుందో చూడాలి.

Follow Disha cinema official page : https://www.facebook.com/Dishacinema

Advertisement

Next Story