- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తనకు ఎలాంటి సినిమాలు ఇష్టమో చెప్పిన బీటౌన్ స్టార్
దిశ, సినిమా: ఇండియాలోని బెస్ట్ యాక్టర్స్‌లో ఒకడిగా పేరు తెచ్చుకున్న రాజ్‌కుమార్ రావు.. బాలీవుడ్ మూవీస్‌లో హీరో పాత్రలను రీడిఫైన్ చేశాడనడంలో సందేహం లేదు. తన 11 ఏళ్ల కెరియర్‌లో ‘కై పో చే, షాహిద్, అలీగర్, సిటీ లైట్స్, బరేలీ కి బర్ఫీ, న్యూటన్, స్ట్రీ, ది వైట్ టైగర్’ సహా నిజ జీవితానికి దగ్గరగా ఉండే అనేక పాత్రల్లో నటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో నేషనల్ అవార్డు కూడా పొందిన నటుడు.. తనకు ఎలాంటి సినిమాలు చేయడం ఇష్టమో వెల్లడించాడు. ‘సాధారణంగా సినిమా రిలీజ్ టైమ్‌లో(శుక్రవారాలు) నటులు ఎదుర్కొనే ఒత్తిడి గురించి నేను అస్సలు పట్టించుకోను. కొన్ని సినిమాలు తెరపై జీవితాన్ని ఆవిష్కరిస్తాయని రిఫ్లెక్ట్ చేస్తాయని విశ్వసిస్తా. ఈ క్రమంలోనే కొన్ని మాత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు కురిపించడంతో పాటు రియల్ లైఫ్‌కు కూడా దగ్గరగా ఉంటాయి. ‘స్ట్రీ’ అలాంటి సినిమానే’ అని చెప్పుకొచ్చాడు.
తను మంచి సినిమాలు మాత్రమే చేయాలని అనుకుంటున్నాని, 50 సంవత్సరాల తర్వాత వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు.. ఇవి నా సినిమాలు అని గర్వంగా చెప్పుకోగలగాలని రాజ్‌కుమార్ పేర్కొన్నాడు. ఇప్పటిదాకా చేసినవన్నీ చిత్రాలన్నీ తనకు ప్రత్యేకమే అని వెల్లడించాడు. కాగా ఇటీవలే హారర్ కామెడీ ‘రూహి’లో కనిపించిన రాజ్.. త్వరలోనే ‘బధాయి దో, హమ్ దో హమారీ దో’ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.