- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
16లక్షల మందికి రైతుబంధు సొమ్ము
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో రైతుబంధు పెట్టుబడి సాయం రైతులకు అందుతోంది. సోమవారం ఉదయం నుంచి బ్యాంకు ఖాతాల్లో రైతుబంధు నగదు జమ చేశారు. ఒక్కరోజు 16.04 లక్షల మంది రైతులకు రూ. 494.11 కోట్లను విడుదల చేశారు. ఈ సొమ్ము రైతుల ఖాతాల్లో జమ అయింది. ముందుగా ఎకరం వ్యవసాయ భూమి ఉన్న రైతుల ఖాతాల్లోకి పెట్టుబడి సాయం పంపిణీ చేస్తున్నారు. వ్యవసాయ శాఖ లెక్కల ప్రకారం ఎకరం వరకు వ్యవసాయ భూమి ఉన్న రైతులు 18.68లక్షల మంది ఉండగా… వీరికోసం రూ. 559.99 కోట్లను బ్యాంకులకు బదిలీ చేశారు. అయితే బ్యాంకు ఖాతాలు మాత్రం 16,03,938 మంది మాత్రమే ఇచ్చారు. మిగిలిన రైతులు బ్యాంకు ఖాతాలు ఇవ్వలేదు. వారి ఆధార్ వివరాలతో బ్యాంకు ఖాతాలు అనుసంధానం కాలేదని తేల్చారు. దీంతో వారికి రైతుబంధు సొమ్ము జమ కాలేదు. సోమవారం 16, 03,938 మందికి రూ. 494,10,86,470 కోట్లు విడుదల చేశారు. 9.88లక్షల ఎకరాల భూమికి ముందు రోజు రైతుబంధు సొమ్ము ఇచ్చారు. ఇక నుంచి ఎకరం కంటే ఎక్కువ వ్యవసాయ భూమి ఉన్న రైతులకు పెట్టుబడి సాయాన్ని విడుదల చేస్తున్నట్లు వ్యవసాయ శాఖ ప్రకటించింది.