క్రౌడ్​ ఫండింగ్​ ద్వారా రూ.1.05 కోట్ల సేకరణ

by Shyam |
క్రౌడ్​ ఫండింగ్​ ద్వారా రూ.1.05 కోట్ల సేకరణ
X

దిశ, న్యూస్​బ్యూరో: హైదరాబాద్‌లోని చిరెక్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌కు చెందిన 190మంది విద్యార్దుల అక్షయ పాత్ర ఫౌండేషన్‌ చేపట్టిన కొవిడ్‌-19 సహాయ కార్యక్రమాలకు మద్దతుగా ఫ్యూయల్‌డ్రీమ్‌.కామ్‌ ద్వారా నిధుల సమీకరణ చేపట్టారు. ఈ క్రౌడ్​ ఫండింగ్​ ద్వారా సేకరించిన రూ.1.05 కోట్ల నిధులను 4లక్షల మందికి పైగా ఆర్థికంగా, ఆకలి తీర్చడంలో సహాయపడొచ్చని అక్షయపాత్ర ఫౌండేషన్​ ప్రతినిధులు తెలిపారు. అక్షయపాత్ర సీఎంఓ సందీప్‌ తల్వార్‌ క్రౌడ్‌ ఫండింగ్‌పై మాట్లాడుతూ.. ‘చిరెక్‌ ఇంటర్నేషనల్‌ విద్యార్థులు, మేనేజ్‌మెంట్‌ నుంచి అందిన మద్దతుకు ఆనందిస్తున్నామన్నారు.

సమాజానికి సేవ చేయడానికి పూర్తిగా అంకితమైన అక్షయపాత్రకు ఈ విద్యార్దులు ముందుకు వచ్చి క్రౌడ్‌ఫండింగ్‌ ద్వారా సహాయపడినందుకు కృతజ్ఞతలు తెలిపారు. అక్షయ పాత్ర, అనుబంధ ఫౌండేషన్లు గత నాలుగు నెలలుగా సమాజంలోని నిరుపేద వర్గాలకు చెందిన సుమారు 70 మిలియన్ల మందికి భోజన సదుపాయాన్ని అందించాయని వివరించారు. ఫ్యూయల్‌డ్రీమ్‌.కామ్‌ వ్యవస్థాపకుడు రంగనాథ్‌ తోట మాట్లాడుతూ మహమ్మారి సమయంలో అక్షయ పాత్రకు గ్లాండ్‌ ఫార్మా, బికెటి, బయోకాన్‌, డ్యూయిష్‌ బ్యాంక్‌, అమెజాన్‌, బర్కలీస్‌, అడోబ్‌, ఎమ్‌యుఎఫ్‌జి బ్యాంకు ఇంకా అనేక ఇతర ప్రముఖ కార్పొరేట్‌ సంస్థల దాతల నుంచి అద్బుతమైన మద్దతు లభించిందని తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed