- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
తెలంగాణలో నేడు, రేపు వర్షాలు..
by Shyam |
X
దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణలోని పలు ప్రాంతాల్లో నిన్న కురిసిన అకాల వర్షం కారణంగా రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కల్లాలు, మార్కెట్లలో ఆరబెట్టిన ధాన్యం తడిసిపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. కాగా, నిన్న రాత్రి రాష్ట్రంలోని 130 ప్రాంతాల్లో వానలు పడ్డాయి. జనగామ జిల్లాలోని లింగాల ఘనపురంలో అత్యధికంగా 4.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
ఒడిశాపై 1,500 మీటర్ల ఎత్తు వరకు గాలులతో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీనికితోడు తమిళనాడు నుంచి కొంకణ్ వరకు గాలులతో ఉపరితల ద్రోణి ఏర్పడింది. వీటి ప్రభావంతో తెలంగాణలో నేడు, రేపు కూడా ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
Advertisement
Next Story