తెలంగాణకు వర్ష సూచన.. ఆ జిల్లాలకు ఎల్లో అలెర్ట్

by Shyam |
heavy rains
X

దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలో ఇప్పటికే కుండ పోతగా వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. ఏపీలోని చాలా ప్రాంతాలు భారీ వర్షాలతో నీట మునిగాయి, ఈ క్రమంలోనే తెలంగాణకు వర్ష సూచన ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం కారణంగా రానున్న 48 గంటల్లో హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. అయితే ఇప్పటికే శుక్రవారం నుంచి తెలంగాణ వాతావరణంలో మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో నారాయణపేట, కామారెడ్డి, నాగర్‌కర్నూల్‌, మహబూబ్‌నగర్‌, వనపర్తి, జోగులాంబ గద్వాల్‌, నల్గొండ, సూర్యాపేట, వికారాబాద్‌, ఖమ్మంలతో పాటు రంగారెడ్డి, హైదరాబాద్‌లో భారీ వర్షలు కురిసే అవకాశం ఉండడంతో ఆప్రాంతాలకు ఎల్లో అలెర్ట్‌ను వాతావరణ శాఖ జారీ చేసింది. ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

Advertisement

Next Story