- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
The Last Hour (Web Series): సూపర్ నేచురల్ పవర్స్‌తో ‘ది లాస్ట్ హవర్’
దిశ, సినిమా : అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ అవుతున్న ‘ది లాస్ట్ హవర్ ’ సిరీస్ ప్రేక్షకుల నుంచి అమేజింగ్ రెస్పాన్స్ అందుకుంటుంది. సూపర్ నేచురల్ క్రైమ్ డ్రామాగా తెరకెక్కిన సిరీస్‌లో సంజయ్ కపూర్, కర్మ తపక, రైమా సేన్ ప్రధాన పాత్రల్లో కనిపించారు. ఇందులో సీక్రెట్ గిఫ్ట్‌ను ప్రొటెక్ట్ చేసేందుకు యువ షమన్ ఒక చోటు నుంచి మరో చోటుకు వెళ్తుండటం, ఈ క్రమంలో తమ్ముడిని కోల్పోయిన షమను తన పవర్స్‌తో దోషులను పట్టుకునేందుకు పోలీసులకు హెల్ప్ చేయడం, ఈ సీక్రెట్ గిఫ్ట్ కోసం షమన్స్‌ను చంపేస్తున్న విలన్‌ను అంతం చేయడం చుట్టూ కథ తిరుగుతూ ఉంటుంది.
ఈ క్రమంలో హండ్రెడ్ పర్సెంట్ థ్రిల్, ఎగ్జైట్‌మెంట్ ఇస్తున్న సిరీస్ తన కెరియర్‌లోనే బెస్ట్ అని చెప్తోంది రైమా సేన్. మనకు తెలియని, మనం చూడలేని కొన్ని ఎలిమెంట్స్ ఈ సిరీస్‌లో ఉన్నాయని.. మరింత తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్ పెంచుతున్నాయని అభిప్రాయపడింది. షమాన్లు, వారి సాంప్రదాయాలు, శక్తుల గురించి చాలా తక్కువ మందికి తెలుసని.. సూపర్ నేచురల్ పవర్స్, థ్రిల్లర్ జోనర్‌లో మేకర్స్ కొత్తగా ట్రై చేయడంతో సిరీస్ సక్సెస్ అయిందని చెప్పింది. 240 దేశాల్లో రిలీజైన ‘ది లాస్ట్ హవర్’ చూసిన ప్రతీ ఒక్కరికీ కొత్త కాన్సెప్ట్‌ను చూశామనే ఫీలింగ్ ఇస్తుందన్న రైమా.. బెస్ట్ కాంప్లిమెంట్స్‌తో దూసుకుపోతున్నందుకు సంతోషంగా ఉందని తెలిపింది.