Raima Sen :నేనేం సిగ్గుపడను.. ఇంతకన్నా బోల్డ్‌గా చేశా

by Shyam |   ( Updated:2021-05-25 03:44:53.0  )
Raima Sen
X

దిశ, సినిమా: తేజ డైరెక్షన్‌లో 2004లో వచ్చిన ‘ధైర్యం’ మూవీలో నితిన్‌కు జంటగా నటించిన రైమాసేన్ .. ఆ తర్వాత హిందీ, బెంగాలీ సినిమాలకే పరిమితమైంది. ఇటీవలే అమెజాన్ ప్రైమ్‌ వీడియో సిరీస్ ‘ది లాస్ట్ అవర్’లో సపోర్టింగ్ రోల్ ప్లే చేసిన భామ.. తన లేటెస్ట్ ఫొటో షూట్‌పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేయడం విశేషం. ఈ వారం మొదట్లో ఫొటోగ్రాఫర్ ఘోష్ నిర్వహించిన షూట్‌కు సంబంధించిన కొన్ని పిక్స్‌ను ఇన్‌స్టాలో షేర్ చేయగా ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్నాయి. ఇందులో జీన్స్‌ను షాట్స్ రూపంలో ధరించిన రైమా.. తన భుజం పై నుంచి కొంటెగా చూస్తున్న స్టిల్ చాలా హాట్‌గా ఉంది. అంతేకాదు ఈ ఫొటోలో టాప్‌లెస్‌గా కనిపించిన బ్యూటీ, తన యద భాగాన్ని ఒక క్లాత్‌తో కవర్ చేసుకున్న బోల్డ్ లుక్‌‌ కుర్రకారు మతిపోగొడుతోంది. అయితే ఈ రిస్కీ ఫొటోషూట్ సమయంలో తను ఏ మాత్రం అసౌకర్యానికి గురికాలేదని, ఎందుకంటే అవి మరీ అంత బోల్డ్‌గా లేవని చెప్తోంది. పైగా తను సిగ్గుపడే వ్యక్తిని కాదన్న భామ.. ‘గతంలో ఇంతకన్నా బోల్డ్‌గా ఫొటోషూట్స్ చేశాను’ అని చెప్పుకొచ్చింది. కాగా ఈ ఫొటో షూట్ మే 15న తన ఇంటి టెర్రస్‌పైనే చేసినట్టు వెల్లడించింది.

Raima Sen on her risque photoshoot: ‘I’m not shy, have done bolder shoots than this’

Advertisement

Next Story