ట్రైన్‌లో ఆ పని చేస్తే ఇక జైలుకే!

by Shamantha N |   ( Updated:2021-03-20 20:29:12.0  )
ట్రైన్‌లో ఆ పని చేస్తే ఇక జైలుకే!
X

దిశ, వెబ్‌డెస్క్: పబ్లిక్ ప్రదేశాల్లో పొగతాగడం నిషేధం అనే విషయం ప్రతిఒక్కరికీ తెలుసు. కానీ తెలిసినా కూడా పొగరాయుళ్లు పబ్లిక్ ప్రదేశాల్లో పొగతాగుతూనే ఉంటారు. పబ్లిక్ ప్రదేశాల్లో పొగతాగితే జరిమానా విధించాల్సి ఉంటుంది. కానీ పోలీసులు అందరినీ పట్టుకోలేరు. అందుకే పొగరాయుళ్లే స్వచ్చంధంగా నిబంధనలు పాటించాల్సి ఉంటుంది.

కానీ కొంతమంది పొగరాయుళ్లు పబ్లిక్ ప్రదేశాల్లో యదేఛ్ఛగా పొగ లాగేస్తున్నారు. ఈ నెల 13న ఢిల్లీ-డెహ్రాడూన్ శతాబ్ధి ఎక్స్‌ప్రెస్‌లో మంటలు చెలరేగి ఒక బోగీ దగ్ధమైంది. ఒక వ్యక్తి తాగి పడేసిన సిగరెట్ వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు గుర్తించారు.

ఈ క్రమంలో రైళ్లల్లో పొగతాగేవారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు రైల్వేశాఖ సిద్ధమైంది. ఇకపై రైళ్లల్లో పొగతాగే వారిని జైలుకు పంపించేలా నిబంధనలు తీసుకురానుంది. రైళ్లల్లో పొగతాగడం ప్రజా ఆస్తుల్ని ధ్వంసం చేయడమేనని, ఇకపై పొగతాగేవారికి జరిమానాతో పాటు జైలుశిక్ష తప్పదని హెచ్చరిస్తోంది.

Advertisement

Next Story

Most Viewed