వైజాగ్ కరోనా పేషంట్ల కోసం రైల్ ఐసోలేషన్ సెంటర్

by srinivas |
వైజాగ్ కరోనా పేషంట్ల కోసం రైల్ ఐసోలేషన్ సెంటర్
X

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కరోనా పేషంట్ల వైద్య సౌకర్యాల కోసం సరికొత్త ఐసోలేషన్ సెంటర్లను అందుబాటులోకి తీసుకురానుంది. ఇప్పటికే వైజాగ్‌లో ఛెస్ట్ ఆసుపత్రితో పాటు, కేజీహెచ్, ఇతర ప్రధాన ప్రైవేటు ఆసుపత్రుల్లో కరోనా రోగులకు వైద్య సాయమందిస్తున్నారు. అయితే భవిష్యత్‌లో వారి సంఖ్య తగ్గే అవకాశాలు అధికంగా కనిపిస్తున్న నేపథ్యంలో సురక్షితమైన అత్యవసర క్వారంటైన్ కేంద్రాలు అందుబాటులో ఉండాలని ఈస్టు కోస్టు రైల్వే విభాగం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో రైలు ఐసోలేషన్ సెంటర్లను అందుబాటులోకి తెచ్చింది. రైల్వే స్టేషన్‌లో నిలిచి ఉంచిన రెండు రైలు బోగీల్లో కరోనా ఐసోలేషన్ సెంటర్లను ఏర్పాటు చేసింది. ఒక్కో బోగీలో 9 మంది కరోనా రోగులకు వైద్య సాయమందేలా ఏర్పాట్లు చేసింది. డాక్టర్ల కోసం మరో బోగీని అన్ని సౌకర్యాలతో అందుబాటులో ఉంచింది. దీంతో కరోనాను కట్టడి చేయవచ్చని, తద్వారా వైజాగ్ వాసులతో సంబంధం లేకుండా చికిత్స అందించవచ్చని ఈస్టు కోస్టు రైల్వే విభాగం భావిస్తోంది.

TAGS: coronavirus, isolation centre, east coast railway, train isolation

Advertisement

Next Story

Most Viewed