- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను నిర్వహించడంలేదు: వంశీచంద్ రెడ్డి
దిశ, షాద్ నగర్: ఓ వైపు దేశ ప్రజలను కరోనా మహమ్మారి ఇబ్బందులకు గురి చేస్తుంటే మరోవైపు భారత్-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తత నెలకొని భారత జవాన్లు అమరులయ్యారని, దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉందని, ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ జన్మదినోత్స వేడుకలు దేశవ్యాప్తంగా ఆర్భాటంగా జరపడం లేదని ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) జాతీయ కార్యదర్శి చల్లా వంశీచంద్ రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గ పరిధిలోని ఎలికట్ట, షాద్ నగర్, నందిగామ, రంగాపూర్ తాండ ప్రాంతాల్లో యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో పర్యటించిన ఆయన పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా షాద్ నర్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సంక్షోభ సమయంలో దేశ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి,, వారికి సామాజిక సేవలతో ఆదుకోవాలనే సంకల్పంతో కాంగ్రెస్ పార్టీ ప్రథమ కర్తవ్యంగా భావించి నేడు ముందుకు కదులుతోందని, సంక్షోభ సమయంలో సైనికుల్లా మారి పేదల్ని ఆదుకోవాలని కాంగ్రెస్ నాయకులకు ,కార్యకర్తలకు ఆయన పిలుపునిచ్చారు.