రైతు చట్టాలు రద్దు.. రాహుల్ గాంధీ కామెంట్స్ ఇవే..

by Anukaran |   ( Updated:2021-11-19 00:57:30.0  )
rahul
X

దిశ, వెబ్‌డెస్క్ : శుక్రవారం ఉదయం మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్టు ప్రధాని మోడీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ప్రకటనపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందించారు. ట్విట్టర్‌లో స్పందిస్తూ.. రైతుల సత్యాగ్రహానికి కేంద్ర ప్రభుత్వం తలవంచక తప్పలేదన్నారు. రైతుల ఆందోళనతో కేంద్రం తన ఈగోను పక్కనబెట్టి మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకుందంటూ రాహుల్ కామెంట్స్ చేశారు. చివరగా జై హింద్.. జై కిసాన్ అంటూ రాసుకొచ్చారు. అంతకుముందు రైతు చట్టాలను రద్దు చేయాలంటూ మాట్లాడిన వీడియో లింక్‌ను యాడ్ చేశారు.

Advertisement

Next Story