ప్రస్తుతం టీమిండియా చాలా పటిష్టంగా ఉంది

by Shyam |
Rahul Dravid
X

దిశ, స్పోర్ట్స్: ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో టీమ్ ఇండియా ఆధిపత్యం చెలాయించే అవకాశం ఉన్నదని మాజీ క్రికెటర్, నేషనల్ క్రికెట్ అకాడమీ డైరెక్టర్ రాహుల్ ద్రవిడ్ అభిప్రాయపడ్డారు. డబ్ల్యూటీసీ ఫైనల్ అనంతరం ఇంగ్లాండ్‌తో టీమ్ ఇండియా 5 మ్యాచ్‌ల సిరీస్‌లో తలపడనున్నది. పర్యాటక జట్టైన ఇండియాకు సిరీస్ గెలిచే ఛాన్స్ ఉన్నదని ద్రవిడ్ చెబుతున్నారు. ఆదివారం ఈఎస్‌పీఎన్ క్రిక్ఇన్ఫో నిర్వహించిన వెబ్‌నియర్‌లో పాల్గొన్న ద్రవిడ్ పలు విషయాలను వెల్లడించారు. ‘ఇంగ్లాండ్ జట్టు బౌలింగ్ విషయంలో తప్పుపట్టాల్సింది ఏమీ లేదు.

వారి సీమ్ బౌలింగ్ చాలా పటిష్టంగా ఉన్నది. ఎలాంటి పరిస్థితుల్లో అయినా వాళ్లు గొప్పగా బౌలింగ్ చేయగలరు. అయితే బ్యాటింగ్ విషయాన్ని పరిశీలిస్తే.. టాప్, మిడిల్ ఆర్డర్‌లో జో రూట్ తప్ప మరో బ్యాట్స్‌మెన్ కనిపించడం లేదు. బెన్‌స్టోక్స్ వంటి బ్యాట్స్‌మెన్ ఉన్నా అతడికి అంతగా నిలకడ లేదు. కానీ టీమ్ ఇండియా బ్యాటింగ్ చాలా పటిష్టంగా ఉన్నది’ అని ద్రవిడ్ అన్నాడు. కాగా, చివరి సారిగా టీమ్ ఇండియా రాహుల్ ద్రవిడ్ సారథ్యంలోనే ఇంగ్లాండ్‌లో టెస్టు సిరీస్ గెలవడం గమనార్హం.

Advertisement

Next Story