- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
అమిత్ షా రాజీనామాకు రాహుల్ డిమాండ్
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలు ఇజ్రాయెలీ స్పైవేర్ పెగాసెస్‌ను భారత దేశం, దాని వ్యవస్థలపైనే ఎక్కుపెట్టారని కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. పార్లమెంటు బయట ఆయన శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. ‘ఇజ్రాయెల్ దేశం పెగాసెస్ స్పైవేర్‌ను ఒక వెపన్‌గా పేర్కొంటున్నది. దాన్ని టెర్రరిస్టులపై దాడి చేయడానికి ఉపయోగించాలి. కానీ, ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా పెగాసెస్‌ను భారత దేశంపై, దాని వ్యవస్థలపై ఎక్కుపెట్టారు. ఈ నిఘా ఆయుధాన్ని కర్ణాటకపై రాజకీయంగా వాడారు. సుప్రీంకోర్టు సహా ఇతర వ్యవస్థలపైనా దాడి చేశారు. ఇది దేశద్రోహమే. మరే పదంతో వారి చర్యలను వర్ణించలేం’ అని ఆరోపించారు. తన ఫోన్‌నూ ట్యాప్ చేశారన్నారు. ‘కేంద్ర ప్రభుత్వం నా ఫోన్‌నూ ట్యాప్ చేసింది. రాహుల్ గాంధీ వ్యక్తిగత వివరాల గురించి చెప్పడం లేదు. నేను ఒక ప్రతిపక్ష నేతను. ప్రజల గళాలను నేను ప్రతిధ్వనిస్తాను. నాపై నిఘా అంటే ప్రజా గళాలపై దాడే. కేంద్ర హోం మంత్రి రాజీనామా చేయాలి. నరేంద్ర మోడీపై సుప్రీంకోర్టు ఎంక్వైరీ చేయాలి’ అని డిమాండ్ చేశారు.
జూనియర్ కాపీరైటర్‌కూ ఆసక్తి ఉండదు: బీజేపీ
రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై బీజేపీ ప్రతినిధి రాజ్యవర్ధన్ రాథోడ్ స్పందించారు. ‘రాహుల్ గాంధీ తన ఫోన్ ట్యాప్ అయినట్టు భావిస్తే సంబంధిత దర్యాప్తు ఏజెన్సీకి ఫోన్‌ను అప్పగించాలి. ఆ ఏజెన్సీ ఐపీసీ ప్రకారం యాక్షన్ తీసుకుంటుంది. రాహుల్ ఫోన్ ట్యాప్ చేయాలనీ జూనియర్ కాపీరైటర్ కూడా అనుకోడు. ఆయనపై ఆసక్తే ఉండదు. ఎందుకంటే అందులో వాస్తవికత ఉండదు. ఫోన్ అయినా, ఇతర డివైజులేవైనా చట్టవిరుద్ధంగా రికార్డు చేయరు. ఎవరైనా అలా భావిస్తే ఏజెన్సీల సహాయం తీసుకోవచ్చు’ పెగాసెస్‌తో నిఘా వేశారన్న ఆరోపణలను ఖండించారు.