చిన్నారి కోరిక తీర్చిన రాహుల్.. ఏం చేశారో తెలుసా.. ?

by Shamantha N |   ( Updated:2023-03-24 18:46:35.0  )
చిన్నారి కోరిక తీర్చిన రాహుల్..  ఏం చేశారో తెలుసా.. ?
X

దిశ, వెబ్ డెస్క్ : కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేత రాహుల్ గాంధీ సోషల్ మీడియాలో ఓ వీడియోను షేర్ చేశారు. ఏ కల పెద్దది కాదు..అద్వైత్ తన కలను నిజం చేసుకొనేందుకు మేం చిన్న సాయం చేశాం అంటూ ఓ చిన్నారి వీడియోను తన ఇన్ స్ట్రాగ్రామ్ లో షేర్ చేశారు.

కేరళ రాష్ట్రంలోని కన్నూరు జిల్లాలోని ఐరవాతిలో తొమ్మి దేళ్ల బాలుడు అద్వైతతో రాహుల్ గాంధీ ముచ్చటించారు. ఆ చిన్నారితో మాట్లాడుతూ రాహుల్ గాంధీ నువ్వు ఏం కావాలనుకుంటున్నావు అని అడిగారు. దానికి సమాధానంగా చిన్నారి నాకు పైలట్ కావాలని ఉంది. నేను ఆకాశంలో ఎగరాలి అనుకుంటున్నాను అని చిన్నారి చెప్పాడు. దాంతో ఆ చిన్నారి కోరికను నెరవేర్చాలనుకున్న రాహుల్ మరసటి రోజు చిన్నారి అద్వైత్ ను కాలికట్ విమానాశ్రయానికి తీసుకెళ్లాడు. అక్కడ విమానం ఎక్కించి తనకు పైలెట్ తో కలసి కాక్ పిట్ గురించి వివరంగా చెప్పారు. చిన్నారులు తమ కలను నెరవేర్చుకోవడానికి అవకాశాలు లభించే సమాజాన్ని, వ్యవస్థలను సృష్టించాల్సిన బాధ్యత మనదే అని రాహుల్ చెప్పుకొచ్చారు.

Advertisement

Next Story