- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
సారీ.. సిగ్గుతో తలదించుకుంటున్నా: రఘురామకృష్ణంరాజు
దిశ, ఏపీ బ్యూరో: కరోనాతో సహజీవనం అనకుండా కరోనాని అరికట్టాలని, తన సొంతూరిలో చెత్త వేసే మున్సిపాలిటీ బండిలో కరోనా బాధితుడిని తీసుకువెళ్లడం బాధాకరమని, దీనికి సిగ్గుతో తలదించుకుంటున్నానని వైఎస్ఆర్సీపీ రెబెల్, నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం జగన్ అట్టహాసంగా వెయ్యికి పైగా అంబులెన్సులు ప్రారంభించారని, అవి అవసరానికి ఉపయోగపడడం లేదని, అందుకు తనను క్షమించాలని జనాన్ని కోరారు. అంబులెన్సులు అందరికీ అందుబాటులోకి వచ్చేలా చేయాలని ప్రభుత్వానికి ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ విషయం సీఎం జగన్ దృష్టికి వెళుతుందని భావిస్తున్నానని చెప్పారు.
కేంద్ర ఆరోగ్య సెక్రటరీ రాజేశ్ భూషణ్‌ని కలిసి రాష్ట్రంలో పరిస్థితులపై చర్చించానన్నారు. కోవిడ్ కేసుల్లో 15వ స్థానంలో ఉన్న ఏపీ 3వ స్ధానంలోకి వెళ్లిందన్నారు. యాంటీబాడీ టెస్టులతో కరోనా నిర్ధారణ ఆలస్యం అవుతోందని, ఏడు రోజులు తర్వాత కోవిడ్ టెస్టుల ఫలితాలు వస్తున్నాయని, ఈలోగా సామాజిక వ్యాప్తి జరుగుతుందన్నారు. రోజూ మూడు జిల్లాల చొప్పున మాట్లాడితే చాలా విషయాలు తెలుస్తాయన్నారు.
ప్రస్తుతం ఏపీలో ఇంత కంటే పెద్ద సమస్య ఏదీ లేదన్న ఆయన, దీనిపై పూర్తిస్థాయిలో దృష్టి కేంద్రీకరించాలన్నారు. ప్రైవేట్ హాస్పిటల్లో దోపిడీ జరుగుతుందని, దానిని అరికట్టాలని సూచించారు. ఏలూరు హాస్పిటల్లో ఆక్సిజన్ సెంట్రలైజడ్ చేస్తున్నారని, అలాగే అన్ని జిలాల్లో చేస్తే బాగుంటుందన్నారు. రాష్టంలో ఆయుర్వేదిక్ చదివిన 8 వేల డాక్టర్స్ ఉన్నారని, వారి సేవలను వినియోగించుకోవాలన్నారు. 24 గంటల్లో ఫలితాలు వచ్చేలా కోవిడ్ టెస్టు నిర్వహిస్తే సామాజిక వ్యాప్తి అరికట్ట వచ్చన్నారు.