- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అప్పుడే సంబరాలొద్దు : రఘురామ్ రాజన్!
దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికి భారత ఆర్థికవ్యవస్థ 7.5 శాతం ప్రతికూలతను నమోదు చేయడం పట్ల చాలామంది ఆర్థిక వేత్తలు సంతృప్తి వేసిన సంగతి తెలిసిందే. అయితే, ఆర్‌బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ మాత్రం సందేహాలను వ్యక్తం చేశారు. తాజాగా వృద్ధి రేటు పట్ల సంతృప్తి పడటం అంటే ముందుగా సంబరాలు చేసుకున్నట్టే అన్నారు.
లాక్‌డౌన్ ప్రభావంతో ఆర్థికవ్యవస్థ ఎంత దెబ్బతిన్నదో తెలిస్తే మరింత ఆందోళన కనిపిస్తుంది. ఆర్థికవ్యవస్థకు నష్టం అధికంగానే ఉంది. ఉద్యోగాల తొలగింపు ప్రభావం దీర్ఘకాలంలో స్థిరమైన డిమాండ్‌లో ప్రతిబింబిస్తుందని చెప్పారు. ప్రస్తుత రికవరీ పరిస్థితులు అనూహ్యమైన డిమాండ్ వల్ల కనిపిస్తోందని, దీని స్థిరత్వంపై సందేహాలున్నాయని చెప్పారు. ఈ రికవరీ సంకేతాలు ఎంతకాలం ఉంటాయనేది అసలైన ప్రశ్న అని రాజన్ పేర్కొన్నారు. ప్రభుత్వం అవసరమైన స్థాయిలో ఖర్చు చేయలేకపోయింది. సెప్టెంబర్ త్రైమాసిక జీడీపీ ప్రతికూల వృద్ధి దీనికి సాక్ష్యమని తెలిపారు.