రఘునందన్ రావు రాజకీయ ప్రస్థానం

by Shyam |
రఘునందన్ రావు రాజకీయ ప్రస్థానం
X

దిశ, వెబ్ డెస్క్: బీజేపీలో కీలక నేత.. క్యాడర్​కు సదా అందుబాటులో ఉంటాడనే పేరు.. రెండుసార్లు ఓటమి పాలైనా పోరాటం ఆపలేదు. చివరకు మూడోసారి విజయం సాధించి.. దుబ్బాక పీఠం కైవసం చేసుకున్నారు మాధవనేని రఘునందన్ రావు. ఐపీఎల్ మ్యాచ్​ తరహాలో ఉత్కంఠగా సాగిన ఓటింగ్​లో అధికార పార్టీపై స్వల్ప ఆధిక్యంతో గెలుపొందారు. టీఆర్ఎస్ జోరు, కాంగ్రెస్ పోటీని దీటుగా ఎదుర్కొని విజయభేరీ మోగించారు. రఘునందన్​ రావు టీఆర్ఎస్‌తో రాజకీయ ప్రస్థానం మొదలు పెట్టి బీజేపీలో కీలక నేతగా ఎదిగారు. చిన్నతనం నుంచి రాజకీయాలపై అవగాహన ఉన్న ఆయన డిగ్రీ వరకూ సిద్దిపేటలో చదివారు. అనంతరం ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎల్​ఎల్​బీ పట్టా పొందారు. తదనంతరం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు బార్ అసోసియేషన్‌లో న్యాయవాదిగా చేరారు. ఆ తర్వాత విలేకరిగా మొదలైన మాధవనేని రఘునందన్​ రావు జీవితం ప్రస్తుతం ఎమ్మెల్యే స్థాయి వరకూ వెళ్లింది.

రెండుసార్లు ఓటమి

టీఆర్ఎస్ ప్రారంభం నుంచి రఘునందన్​ రావు పార్టీలో కీలకంగా పని చేశారు. పొలిట్‌బ్యూరో సభ్యులుగా, మెదక్ జిల్లా అధ్యక్షులుగా ఉన్నారు. 2013లో గులాబీ పార్టీ నుంచి సస్పెండ్ అయి, బీజేపీలో చేరారు. 2014, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో దుబ్బాక నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం ఇటీవల అనారోగ్య కారణాల వల్ల మరణించడంతో ఉప ఎన్నికలు వచ్చాయి. అయితే ఈ ఎన్నికల్లో పోటీ చేసిన రఘునందన్ రావు, టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట రామలింగారెడ్డి సతీమణి, సుజాతపై విజయం సాధించారు.

Advertisement

Next Story

Most Viewed