దుబ్బాక ఉపఎన్నిక బీజేపీ అభ్యర్థి ఖరారు?

by Anukaran |   ( Updated:2020-10-04 12:59:58.0  )
దుబ్బాక ఉపఎన్నిక బీజేపీ అభ్యర్థి ఖరారు?
X

దిశ, వెబ్‌డెస్క్: సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గ ఉపఎన్నిక బీజేపీ అభ్యర్థిగా రఘునందన్‌రావు పేరును ఖరారు చేస్తూ హైకమాండ్ ప్రకటన చేసినట్టు తెలుస్తోంది. టీఆర్ఎస్ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మరణంతో దుబ్బాకకు ఉప ఎన్నిక అనివార్యం కాగా అప్పటి నుంచి రఘునందన్‌రావు ప్రచారం చేస్తున్నారు. దీంతో ఆయననే బరిలోకి దింపేందుకు పార్టీ మొగ్గుచూపుతున్నట్లు సమాచారం. ఆయన ఇటీవల మంత్రి హరీశ్‌రావును టార్గెట్ చేస్తూ ప్రచారంలో దూసుకెళ్తున్నారు. నవంబర్ 3న దుబ్బాక ఉప ఎన్నికకు పోలింగ్ జరగనుండగా… 10వతేదీన కౌంటింగ్ నిర్వహించనున్నారు. అటు టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఎవరి అభ్యర్థిత్వాలను ఖరారు చేస్తాయన్న దానిపై ఆయా పార్టీ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది. ఇవాళ లేదా రేపు ఉదయం వరకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఖరారు చేస్తామని ఉత్తమ్ కుమార్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed