విద్యుత్ చార్జీలు తగ్గించాలి

by Shyam |
విద్యుత్ చార్జీలు తగ్గించాలి
X

దిశ, మెదక్: పెంచిన విద్యుత్ చార్జీలు తగ్గించాలని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి రఘునందన్ రావు, సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు దూది శ్రీకాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం సిద్దిపేట విద్యుత్ శాఖ ఎస్‌ఈ కరుణాకర్ బాబును కలసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా రఘునందన్ రావు మాట్లాడుతూ.. లాక్‌డౌన్ కారణంగా పనులు లేక ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం కరెంట్ చార్జీలు పెంచి మరింత భారం మోపిందని విమర్శించారు.వినతి పత్రం ఇచ్చిన వారిలో బీజేపీ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు శ్రీకాంత్‌రెడ్డి పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed