అమ్మాయిలు.. నాట్ ఫర్ సేల్ : రాధికా ఆప్టే

by Anukaran |   ( Updated:2020-08-23 06:50:38.0  )
అమ్మాయిలు.. నాట్ ఫర్ సేల్ : రాధికా ఆప్టే
X

న‌టి రాధికా ఆప్టే ఏం చేసినా సంచ‌ల‌న‌మే. తెర‌పై పాత్ర‌లను ఎంచుకోవడంలో ఆమె ధైర్యానికి సలామ్ చెప్పల్సిందే. స్ర్రీన్‌ మీద బోల్డ్‌గా నటించమే కాదు.. బ‌య‌ట కూడా అంతే సెన్సేష‌న‌ల్ కామెంట్స్ చేస్తుంటుంది. ఎప్పుడూ వార్తల్లో ఉంటూ, సోష‌ల్ మీడియాలో ఏదో ఒక సెన్షేషన్‌కు తెర తీస్తుంది ఈ బ్యూటీ. తాజాగా గర్ల్స్ ‘నాట్ ఫర్ సేల్’ అంటూ మరో కొత్త ఉద్యమానికి నాంది పలకబోతుంది రాధిక.

ఎరోస్ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో ఇటీవలే ‘ఫ్లెష్’ అనే వెబ్ సిరీస్ ప్రసారమైంది. ‘హ్యుమన్ ట్రాఫికింగ్’ మీద ఈ సిరీస్ తెరకెక్కగా.. సెక్స్ ట్రాఫికింగ్‌లోని వాస్తవాలను తెరమీద చూపించారు. అయితే, ఈ సిరీస్ చూసిన రాధిక భావోద్వేగానికి గురైంది. ‘నాకు ఫ్లెష్ ఎపిసోడ్స్ చూసి గూస్ బంప్స్ వచ్చాయి. దుకాణంలో కొనుగోలు చేసే వస్తువుల్లా.. అమాయకపు ఆడపిల్లల్ని చూస్తుంటే చాలా బాధేసింది. ఇలాంటి సంఘటనల్లో చిక్కుకున్నాక, మనల్ని ఎవరో ఒకరు రెస్క్యూ చేసినా.. ఆ ఘటన నుంచి బయటకు రావడం చాలా కష్టం. నేను ఏసీపీ రాధ నౌతియాల్‌కు మద్దతిస్తున్నాను. ఓ మనిషిగా చెబుతున్నాను.. ‘నేను అమ్మకానికి కాదు’ (నాట్ ఫర్ సేల్). మీరు కూడా నన్ను సపోర్ట్ చేయండి. మీ ఫొటోలను ‘నాట్ ఫర్ సేల్‘ అనే ట్యాగ్‌తో సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయండి. దీనికి మీ ఫ్రెండ్స్‌ను నామినేట్ చేయండి’ అని రాధిక పోస్ట్ పెట్టింది.

View this post on Instagram

I got goosebumps with every episode of #Flesh, watching innocent girls being treated like some things that you buy from shops! It's so difficult to recover from this experience even if you're rescued by someone. I stand with ACP Radha Nautiyal and @reallyswara and want to say that I am #NotForSale and neither is any other human being. I encourage @sarah.a88 @jayasaha @siddhanthkapoor @ishikamohanmotwane @therichachadha and you to support the same! Upload your picture and tag #NotForSale and nominate your friends. Watch the chilling realities of sex trafficking in #Flesh, episodes streaming now on @ErosNow – https://bit.ly/2YoIEC6 @reallyswara @akshay0beroi #SiddharthAnand @dontpanic79 @mahima_makwana @natasastankovic__ @yudi__yudhishtir @vidyamalavade @udaytikekar @mamta10_10 #PoojaLadhaSurti @ridhimalulla #HumansForSale

A post shared by Radhika (@radhikaofficial) on

Advertisement

Next Story