- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాధిక కూతురి భావోద్వేగ లేఖ.. తప్పక చదవాల్సిందే!
దిశ, సినిమా: రాధికా శరత్ కుమార్ కూతురైన ‘రాయనే మిథున్’ ప్రస్తుతం ఇద్దరు పిల్లలకు తల్లి. అయితే పుట్టినపుడు రేపో మాపో అన్నట్టుగా ఉన్న తన కూతురు.. ఇప్పుడు సంపూర్ణ ఆరోగ్యంతో ఆడుకోవడాన్ని చూసి రాయనే సంబరపడుతోంది. ఈ సందర్భంగా తన కూతురి గురించి ఓ ఎమోషనల్ నోట్ షేర్ చేసింది. కూతురు రాధ్యను ఎందుకు అద్భుతంగా అభివర్ణిస్తారని చాలా మెసేజ్‌లు వస్తున్నాయని, వాటన్నిటికి సమాధానం చెప్పాలనుకుంటున్నానని తెలిపింది. ‘నిజమే నా కూతురు ‘డ్యామ్ మిరాకిల్’. 31 వారాలకే కిలో బరువుతో పుట్టిన తను.. నెలరోజుల వరకు కూడా మెషిన్ సాయంతో శ్వాస తీసుకుంది. హాస్పిటల్‌లో తన చుట్టూ మెషిన్స్ ఉండేవి. తన బాడీ అంతా ట్యూబ్‌లు, వైర్లతో ప్లగ్ చేయబడి ఉండేది’ అని చెప్పింది. ఆ సమయంలో పాప శరీరంలోని ప్రతీ ఎముకను లెక్కించేలా, తన మోచేయి పరిమాణంలో మాత్రమే ఉండేదని తెలిపింది.
తల్లిదండ్రులకు చాలా వరెస్ట్ థింగ్ ఏంటంటే.. బిడ్డ మ్యాగ్జిమమ్ ఒక్కరోజే బతుకుంది, మీరు ఇక ఇంటికి వెళ్లొచ్చని చెప్పడమన్న రాయనే.. అలాంటి న్యూస్‌తోనే కూతురిని ఇంటికి తీసుకొచ్చామని తెలిపింది. ‘అంతకుముందు చాలా సమస్యలు డీల్ చేశాను కానీ ఇది డిఫరెంట్, చాలా బాధపడ్డాను.. మూడు వారాల వరకు కూడా తనను ఎత్తుకోలేకపోయాను, కేవలం తన నుదురు మాత్రమే టచ్ చేసేదాన్ని. ఒక తల్లిగా దేవుడిని ఒక్కటే ప్రార్థించాను. నా చేతుల్లో ఏమీ లేదు నువ్వే చూసుకోవాలి’ అని అప్పటి సిచ్యువేషన్‌ను గుర్తుచేసుకుంది. రాధ్య నిజంగా ఫైటర్.. ఆమె బాస్ బేబీ అని గర్వంగా చెప్పుకుంటానంది. తను ‘నా యూనికార్న్, నా మిరాకిల్’ అన్న రాయనే.. తన కూతురిని సంపూర్ణారోగ్యంతో తన చేతుల్లో పెట్టిన జీజీ హాస్పిటల్‌కు చెందిన వైద్యులు, నర్సులు, స్టాఫ్‌కు రుణపడి ఉంటానని తెలిపింది. ఎవరైనా ఇలాంటి టన్నెల్(సమస్య) గుండా పయనిస్తే ఖచ్చితంగా గుర్తుంచుకోండి.. సొరంగం చివర ఒక కాంతిపుంజం ఉంటుందని చెప్పుకొచ్చింది.