హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు.. నేను అలా ప్రేమించలేను

by Shyam |
హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు.. నేను అలా ప్రేమించలేను
X

దిశ, సినిమా : యాక్ట్రెస్ రాధిక మదన్ తన అప్‌కమింగ్ రొమాంటిక్ ఫిల్మ్ ‘శిద్ధత్’ రిలీజ్ కోసం ఎదురుచూస్తోంది. ఈ సందర్భంగా తన సొంత లవ్ గురించి మాట్లాడిన నటి.. తనకు ఇన్‌స్టాల్‌మెంట్స్‌లో ప్రేమించడం నచ్చదంటూ కుండబద్ధలు కొట్టింది. లవ్ విషయంలో సీరియస్‌గా ఉంటానని, అయితే జీరో పర్సెంట్ లేదంటే 100% ఉంటుందని చెప్పింది. 2014లో ‘మేరీ ఆషీకి తుమ్ సే హై’ టెలివిజన్ షోతో యాక్టింగ్ కెరీర్ స్టార్ చేసిన రాధిక.. 2018లో ‘పటాకా’ మూవీ ద్వారా బిగ్ స్క్రీన్‌కు ఎంట్రీ ఇచ్చింది. ఈ క్రమంలో ఇర్ఫాన్ ఖాన్ లీడ్ రోల్ పోషించిన ‘ఆంగ్రేజీ మీడియం’తో పాటు ‘రే’ వెబ్ సిరీస్‌లో నటనకు విమర్శకుల ప్రశంసలు పొందింది. సినిమాల్లో తను ప్లే చేసే ప్రతీ క్యారెక్టర్‌కు బెస్ట్ ఇచ్చేందుకు ట్రై చేస్తానని చెబుతున్న మదన్.. దాన్ని ఒక చాలెంజ్‌గా తీసుకుంటానని తెలిపింది. ఇక రాధిక ప్రజెంట్ ఫిల్మ్ ‘శిద్ధత్’లో సన్నీ కౌశల్, మోహిత్ రైనా, డయానా పెంటీ నటిస్తుండగా.. అక్టోబర్ 1 నుంచి డిస్నీ+హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది.

Advertisement

Next Story