- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భారీగా ఖర్చు పెట్టేస్తున్న ‘రాధే శ్యామ్?’
దిశ, వెబ్‌డెస్క్ : రెబల్ స్టార్ ప్రభాస్ రేంజే వేరు. బాహుబలి తర్వాత పాన్ ఇండియా స్టార్ అయిపోయిన ప్రభాస్‌తో ఎన్ని కోట్లు పెట్టి సినిమా నిర్మించినా సరే.. అవుట్‌పుట్ అదిరిపోతుందనే అభిప్రాయానికి నిర్మాతలు ఆల్రెడీ వచ్చేశారు. అందుకే ఆయన సినిమాలు భారీ బడ్జెట్‌తో రూపొందుతున్నాయి. టాక్ ఎలా ఉన్నా.. ప్రాఫిట్స్ మాత్రం పక్కా అనుకుంటున్న ప్రొడ్యూసర్స్ ఏ మాత్రం సంకోచించకుండా కోట్లకు కోట్లు ఖర్చు పెట్టేస్తున్నారు. సాహో విషయంలో అదే జరగ్గా.. ఇప్పుడు ‘రాధే శ్యామ్’ విషయంలోనూ అదే రిపీట్ అవుతోంది.
ఇటలీలో ఈ మధ్యే భారీ షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న ‘రాధే శ్యామ్’.. త్వరలోనే హైదరాబాద్‌లో మరో షెడ్యూల్ ప్రారంభించబోతుంది. కాగా ఈ షెడ్యూల్‌లో భారీ క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్స్ ప్లాన్ చేసిన టీమ్.. ఇందుకోసం రూ. 30 కోట్లు ఖర్చుపెట్టబోతుందని టాక్. హాలీవుడ్ మూవీ గ్లాడియేటర్ యాక్షన్ కొరియోగ్రాఫర్, ఆస్కార్ విన్నర్ నిక్ పావెల్ ఈ సినిమా కోసం పనిచేస్తుండగా.. యాక్షన్ సీన్స్‌పై అంచనాలు పెరిగిపోయాయ్. పీరియాడికల్ రొమాంటిక్ లవ్ స్టోరీగా వస్తున్న రాధే శ్యామ్‌లో ప్రభాస్, పూజా హెగ్డే కెమిస్ట్రీకి ఇప్పటికే మంచి మార్కులు పడగా.. లవ్ అండ్ యాక్షన్ సీన్స్ అద్భుతంగా ఉన్నాయని తెలుస్తోంది. అంతేకాదు ఈ సినిమాతో డైరెక్టర్ రాధాకృష్ణ కుమార్ స్టార్ డైరెక్టర్ అయిపోతాడని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.