హాట్ ఫొటోలతో కుర్రకారు మతిపోగొడుతున్న బబ్లీ బ్యూటీ.. షెడ్యూల్ ఫుల్ బిజీ

by Shyam |   ( Updated:2021-12-24 23:52:22.0  )
Raashi khanna
X

దిశ, వెబ్‌డెస్క్: బబ్లీ బ్యూటీ రాశి ఖన్నా మంచి జోరులో ఉంది. వరుస సినిమాలను ఓకే చేస్తూ ఫుల్ బిజీగా మారిపోయింది. అమ్మడు తెలుగు, హిందీ, తమిళ భాషల్లో వరుస అవకాశాలు అందుకుంటోంది. సోషల్ మీడియాలోనూ మంచి యాక్టివ్‌గా ఉంటుంది. తన హాట్ ఫొటోలతో కుర్రకారు నిద్రలు చెడగొడుతోంది. అయితే ప్రస్తుతం అమ్మడు మామూలు బిజీగాలేదు. చేతితో ఆరు సినిమాలతో ఫుల్ బిజీ షెడ్యూల్‌తో ఉంది.

తెలుగులో గోపీచంద్ సరసన ‘పక్కా కమర్షియల్’, నాగచైతన్యకు జంటగా ‘థాంక్యు’ సినిమాలు చేస్తోంది. ఈ రెండు సినిమాలు వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాయి. వీటితో పాటు తమిళంలో కార్తీ సినిమా ‘సర్దార్’లో కనిపించనుంది. అంతేకాకుండా ధనుష్ మూవీ ‘తిరుచిత్రంబలం’, శివాజి, అర్జున్ ప్రధాన పాత్రల్లో వస్తున్న ‘మేధావి’ సినిమాల్లో నటిస్తోంది. ఇక హిందీ విషయానికొస్తే సిద్దార్థ్ మల్హోత్రా హీరోగా వస్తున్న ‘యోధ’ సినిమాలో చేస్తోంది. వీటన్నింటితో పాటు రెండు వెబ్ సిరీస్‌ల్లోనూ అమ్మడు కనిపించనుంది.

తన ప్రియుడిని ప్రకటించనున్న కియారా అద్వానీ.. ముహూర్తం ఫిక్స్..??

Advertisement

Next Story