- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టీఆర్ఎస్‌లోకి ఆర్. కృష్ణయ్య.. MLC ఆఫర్ ఇచ్చిన KCR.?
దిశ, మన్సురాబాద్ : హుజురాబాద్ ఎన్నికల వేళ మరో సంచలన వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య త్వరలో అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఎన్నికల అనంతరం టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకొనున్నట్టు విశ్వసనీయ సమాచారం.
ఈ నేపథ్యంలోనే కృష్ణయ్యకు సీఎం కేసీఆర్ ఎమ్మెల్సీ పదవిని కూడా ఆఫర్ చేశారని కూడా వార్తలు గుప్పుమంటున్నాయి. అయితే.. ఆర్. కృష్ణయ్య ఇప్పటికే మంత్రి గంగుల కమలాకర్‌తో పాటు, టీఆర్ఎస్ సీనియర్ నేత వినోద్ కుమార్‌తో పలుమార్లు సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. ఇక హుజురాబాద్ ఉప ఎన్నిక వేళ బీసీ సంక్షేమ సంఘంతో పాటు 120 బీసీ కులాలు.. గెల్లు శ్రీనివాస్‌కే మద్దతు ఇస్తున్నట్లు ఆయన ప్రకటించడంతో ఆర్. కృష్ణయ్య కారెక్కడం ఖాయమంటూ అందరూ ఫిక్స్ అయిపోయారు. కృష్ణయ్య టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారన్న వార్తతో బీసీ సంఘాల నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.