Ind vs SA Test Series : టీమిండియాకు గుడ్ న్యూస్..

by  |
Ind vs SA Test Series : టీమిండియాకు గుడ్ న్యూస్..
X

దిశ, వెబ్‌డెస్క్ : డిసెంబర్ 26న సెంచూరియన్ వేదికగా భారత్, సౌతాఫ్రికా మధ్య టెస్టు సిరీస్ ఆరంభం కానుంది. ఈసారి సఫారీలపై టెస్టు సిరీస్ గెలిపే లక్ష్యం టీమిండియా ప్లాన్స్ చేసుకుంటోంది. అందుకోసం జట్టులో మార్పులు సైతం చేసింది. ఇదిలా ఉండగా సౌతాఫ్రికా జట్టుకు బిగ్ షాక్ తగిలింది. సిరీస్‌లో మూడో టెస్టుకు దక్షిణాఫ్రికా వికెట్​కీపర్ క్వింటన్​డికాక్​దూరం కానున్నట్లు తెలుస్తోంది. అతడి భార్య సాషా జనవరి తొలినాళ్లలో తమ తొలి బిడ్డకు జన్మనివ్వనుండటమే అందుకు కారణమని సమాచారం. అయితే బయోబబుల్ సహా ఇతర ఆంక్షల వల్ల రెండో టెస్టుకూ అతడు అందుబాటులో ఉండకపోవచ్చని సమాచారం.

షెడ్యూల్ ఇదే..

– డిసెంబర్ 26న సెంచూరియన్ వేదికగా తొలి టెస్టు.
– జనవరి 3న జోహన్స్‌బర్గ్ వేదికగా రెండో టెస్టు.
– జనవరి 11న కేప్‌టౌన్ వేదికగా మూడో టెస్టు.
– జనవరి 19 నుంచి టీమిండియా మూడు వన్డేల సిరీస్‌లో సఫారీ జట్టుతో తలపడనుంది.

Advertisement

Next Story