ఐపీఎల్‌పై ఇంజమామ్ ఆరోపణలు

by Shyam |
ఐపీఎల్‌పై ఇంజమామ్ ఆరోపణలు
X

దిశ, స్పోర్ట్స్: ఐసీసీ టీ20 వరల్డ్‌కప్‌ను వాయిదా వేసి, అదే సమయంలో ఐపీఎల్ నిర్వహిస్తే దాని వెనుక ఏదో జరిగినట్లే అని పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ ఉల్ హక్ ఆరోపించారు. కరోనా కారణంగా క్రికెటర్ల ఆరోగ్యాలను ఫణంగా పెట్టడం ఇష్టం లేక ఐసీసీ వరల్డ్ కప్ వాయిదా వేయాలని ఐసీసీ యోచిస్తున్నది. మరి అలాంటి సమయంలో ఐపీఎల్ నిర్వహిస్తే ఆటగాళ్లకు రిస్క్ ఉండదా అని ఆయన ప్రశ్నించారు. ‘బీసీసీఐ చాలా బలమైన క్రికెట్ బోర్డ్ అని అందరికీ తెలుసు. ఐసీసీలో దానిదే పెత్తనమనేది బహిరంగ రహస్యమే. కరోనా వల్ల టీ20 వరల్డ్‌కప్ నిర్వహించలేమని ఆస్ట్రేలియా చేతులెత్తేస్తే అది ఆమోదయోగ్యమే. కానీ, అదే సమయంలో ఇతర ఈవెంట్లు జరిగితే దానిపై అనుమానాలు తప్పవు’ అని ఇంజమామ్ అన్నారు. మరోవైపు ఐసీసీ నిర్ణయంతో సంబంధం లేకుండా ఐపీఎల్ నిర్వహణకు బీసీసీఐ ప్రణాళికలు రచిస్తున్నది. ఇన్నాళ్లూ పీసీబీలోని ముఖ్య అధికారులు మాత్రమే ఐపీఎల్‌ నిర్వహణకు అడ్డుపడుతూ వస్తున్నారు. తాజాగా పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు కూడా వారి రాగానికి జత కలువడం గమనార్హం.

Advertisement

Next Story

Most Viewed