తాజ్‌మహాల్ వద్ద కొండచిలువ సంచారం..

by Shamantha N |
తాజ్‌మహాల్ వద్ద కొండచిలువ సంచారం..
X

దిశ, వెబ్ డెస్క్ : దేశంలో కరోనా వ్యాప్తి చెందుతున్న సమయంలో పలు ముఖ్యపర్యాటక కేంద్రాలను అధికారులు మూసేశారు. లాక్‌డౌన్ సమయంలో జనసంచారం లేక వన్యప్రాణులు రోడ్ల మీదకు వచ్చి సంచరించిన దృశ్యాలు పలు మీడియా, సామాజిక మాద్యమాల్లో వీక్షించిన విషయం తెలిసిందే,

అయితే, దేశంలోని చారిత్రక కట్టడం, ప్రపంచ వింతల్లో ఒకటైన తాజ్‌మహాల్‌ను లాక్‌డౌన్‌లో భాగంగా మూసివేయడంతో సందర్శకులు లేక వెలవెలబోతోంది. పర్యాటకుల సందడి లేకపోవడంతో తాజ్ పరిసరాలు బోసిపోయాయి. ఈ క్రమంలోనే ఏడు అడుగుల పొడవైన కొండచిలువ దారి తప్పి సోమవారం సాయంత్రం తాజ్‌మహాల్‌ ప్రాంగణంలో దర్శనమిచ్చింది. అది గమనించిన సెక్యూరిటీ సిబ్బంది వెంటనే వైల్డ్‌ లైఫ్‌ ఎస్‌ఓఎస్‌ బృందానికి సమాచారం అందించారు.

అక్కడకు చేరుకున్న బృందం దాన్ని పట్టుకొని అడవిలోకి తీసుకెళ్లి వదిలేశారు. అనంతరం ఓ అధికారి మాట్లాడుతూ.. తాజ్‌మహల్ ప్రాంగణంలోకి ప్రవేశించిన కొండ చిలువను రక్షించామన్నారు. ఇది పశ్చిమ భాగంలో ఉన్న తాజ్ మ్యూజియం వెలుపల కనిపించినట్లు వెల్లడించారు. ఎస్‌ఓఎస్‌ సీఈఓ కార్తీక్ సత్యనారాయణ మాట్లాడుతూ.. తాజ్‌మహల్ వద్ద భద్రతా సిబ్బంది సహకారంతో పామును పట్టుకుని సంరక్షించామని తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed